ప్రభాస్‌.. ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’లో ఎన్నో హైలెట్స్ !

‘రాధేశ్యామ్‌’ సినిమా షూట్‌ను దాదాపు పూర్తి చేసిన ప్రభాస్‌ ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ సినిమాల షూటింగ్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తున్నారు. ‘కేజీఎఫ్‌’ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘సలార్‌’ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం సెట్‌ వర్క్‌ జరుగుతుంది. ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు . పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘సలార్‌’ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. ఈ చిత్రం బొగ్గు గనుల నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. పూర్తయిన తొలి షెడ్యూల్‌లో హై వోల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఒకటి తీశారు. ఇంకా కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తీయాల్సి ఉంది. వాటిలో ఒకదాంట్లో ప్రభాస్‌ సిక్స్‌ప్యాక్‌ చూపిస్తారని టాక్‌. కొవిడ్‌-19 రెండో దశ ఉధృతి తగ్గిన తర్వాత ప్రారంభమయ్యే షెడ్యూల్‌లో సిక్స్‌ ప్యాక్‌ చూపించే యాక్షన్‌ సీన్స్‌ తీయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ఆర్మీ ఆఫీసర్‌గా ప్రభాస్‌… ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ చిత్రం రూపొందుతోంది కదా. ఈ సినిమాలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉంటాయట. ప్రభాస్‌ ఇందులో రెండు పాత్రలు చేస్తున్నది నిజమే… అయితే ఇంకో పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది.

ప్రభాస్‌ అక్క పాత్రలో జ్యోతిక ?… సలార్‌లో ప్రభాస్‌ సరసన శృతిహాసన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్‌కి అక్కగా జ్యోతిక నటిస్తారనే వార్త లొస్తున్నాయి. మొదటగా డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ ప్రభాస్‌కి అక్కగా నటించే పాత్రలో సీనియర్‌ నటి రమ్యకృష్ణను అనుకున్నారట. అయితే ఆ తర్వాత నటి జ్యోతిక దగ్గరకు స్క్రిప్టును తీసుకెళ్లగా.. ఆమెకు కథ నచ్చినట్లు సమాచారం. అయితే జ్యోతిక  తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు.  మరి ఆమె ఈ చిత్రంలో ప్రభాస్‌ అక్క పాత్రలో నటించడానికి ఒప్పుకుంటే.. తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో ఆమె కనిపించనున్నారు. ఈ చిత్రంలో జ్యోతిక నటించే పాత్ర కన్నడ వెర్షన్‌లో ప్రియాంక త్రివేది నటించనున్నారు.

పొలిటికల్‌ జర్నలిస్ట్‌ శ్రుతీహాసన్‌ !… ‘సలార్‌’లో శృతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రుతీహాసన్‌ పొలిటికల్‌ జర్నలిస్ట్‌ పాత్ర చేస్తున్నారని సమాచారం. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి జర్నలిస్ట్‌లు ఎలా ప్రశ్నిస్తారు? వారి తీరు ఎలా ఉంటుంది? అనే విషయాలను తెలుసుకుని, చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ఇటీవల సలార్‌ షూటింగ్‌లో పాల్గొన్న శృతీహాసన్‌.. ప్రభాస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. సెట్‌లో ఆయన చాలా కూల్‌గా, సింపుల్‌గా ఉంటారని, ప్రభాస్‌ అంత సింపుల్‌గా ఉంటారని తాను ఊహించలేదని చెప్పుకొచ్చింది. ప్రభాస్‌ అందరితో చాలా ఆప్యాయతగా మాట్లాడుతారని, ఆయన సెట్‌లో ఉన్నంతసేపు సందడిగా ఉంటుందని చెప్పింది. స్టార్‌ హీరో అనే విషయాన్నే ఆయన పట్టించుకోడట. ప్రభాస్‌తో నటించడం ఎవరికైనా చాలా కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది శృతీ హాసన్‌.

శ్రీనిధి స్పెషల్‌ సాంగ్‌ హైలెట్‌ !… ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. సలార్‌ సినిమాలో ప్రభాస్‌తో స్పెప్పులేసేందుకు ‘కేజీఎఫ్‌’ భామ శ్రీనిధి శెట్టిని రంగంలోకి దింపుతున్నారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ఈ భామతో ఓ స్పెషల్‌ సాంగ్‌ను ప్లాన్‌ చేసింది చిత్ర బృందం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సలార్‌లో ఈ స్పెషల్‌ సాంగ్‌ హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం.  నెక్స్ట్ షెడ్యూల్‌లోనే ఈ కన్నడ భామతో ప్రభాస్‌ స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరణ ఉండనుందట. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్‌ను మొదట పెట్టనున్నారని సమాచారం.