‘సాహో’ షూటింగ్ అన్నాళ్ళూ ఎడారిలోనే యూనిట్ బస

వారం అవుతోంది… ప్రభాస్‌ అండ్‌ ‘సాహో’ టీమ్‌ అబుదాబి వెళ్ళి! నిజం చెప్పాలంటే… నాలుగు నెలల క్రితమే అక్కడకి వెళ్ళాలనుకున్నారు. అనుమతులు, ఇతరత్రా వ్యవహారాల అబుదాబి వెళ్ళడం వల్ల కొంచెం ఆలస్యమైంది. మొత్తానికి వెళ్ళారు. ఏడాది దేశంలో తెలుగు తెరపై కనీవినీ ఎరుగని రీతిలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీయాలనేది ప్లాన్‌. సోమవారం (ఈ నెల 10న) చిత్రీకరణ ప్రారంభించి, నెల రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాలు తీయనున్నారు. అందులో ముఖ్యంగా బుర్జ్‌ ఖలీఫా, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ అండ్‌ ఎతిహాద్‌ టవర్స్‌ దగ్గర తీయబోయే ఛేజ్‌ సినిమాకి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుందట. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో ‘ట్రాన్స్‌ఫార్మర్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలుకు పనిచేసిన కేన్నీ బేట్స్‌ నేతృత్వంలో కళ్లుచెదిరేరీతిలో స్టంట్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇండియన్‌ స్క్రీన్‌ మీద అత్యంత ఖరీదైన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఇదేనట. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం యూఎస్, జర్మనీల నుంచి ఖరీదు గల కార్లు, బస్సులను తెప్పించారట. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ యాక్షన్‌ సీన్లకు సుమారు 40 కోట్లు ఖర్చవుతుందని సమాచారం. అన్నట్టు… ఈ నెల రోజులూ చిత్రబృందానికి బస ఎక్కడో తెలుసా? విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… ఏడారిలో ‘సాహో’ టీమ్‌ కోసం స్పెషల్‌ క్యాంప్‌ సెట్‌ చేశారట! ప్రస్తుతం అక్కడ అందరూ ప్రిపేర్‌ అవుతున్నారట! ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌.ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌కి సంబంధించిన ప్రోమోను త్వరలో విడుదల చేయడానికి యూనిట్‌ సన్నాహాలు చేస్తోందట.

శ్రద్ధా చేసే యాక్షన్ సీన్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి !

‘బాహుబలి’  తర్వాత ప్రభాస్‌ చేస్తున్న సినిమా ‘సాహో’ కావడంతో ‘సాహో’పై  మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ నటిస్తోంది. ఈ సినిమా గురించి నటుడు ప్రభాస్  మాట్లాడుతూ.. శ్రద్ధా పాత్ర మూవీలో చాలా కీలకం కానుంది. ఆమెను కేవలం పాటలు, డ్యాన్స్ కోసం మాత్రం తీసుకోలేదు. గతంలో ఏ బాలీవుడ్ నటితో మూవీ చేయలేదు. కానీ సోహోకు శ్రధ్దాను తీసుకోవడం బెస్ట్ చాయిస్.సినిమాలో శ్రద్ధా చేసే యాక్షన్ సీన్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. సాహో సినిమాలో శ్రద్ధాకపూర్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మూవీ కోసం ఆమె చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆమె నటన, సినిమాలపై ఉన్న ఆసక్తికి ఇంప్రెస్ అయ్యాను. గతంలో నాతో పాటు నటించిన హీరోయిన్లలో కొందరు ముందు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆపై బాలీవుడ్ వెళ్లారు. కానీ శ్రద్ధా మాత్రం బాలీవుడ్‌లో ప్రూవ్ చేసుకున్న తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేయడం సంతోషంగా ఉందన్నారు’      ప్రభాస్.