అనివార్య కారణాల వల్ల రెండువారాలు వెనక్కి ?

‘రెబెల్ స్టార్’ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్, విక్కీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ర‌న్‌ రాజా రన్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ ఈ చిత్రానికి దర్శకుడు. భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేస్తామని ఇప్పటి వరకు చిత్రయూనిట్ చెప్పింది.కానీ ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కావడం లేదట. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30న విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. దీంతో ఇప్పటి వరకు ‘సాహో’ విడుదలను దృష్టిలో పెట్టుకుని వాయిదా పడిన చిత్రాలన్నీ ఈ ఆగస్ట్ 15కు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ ‘రణరంగం’, అడవి శేష్ ‘ఎవరు’ చిత్రాలు ఆగస్ట్ 15న విడుదల అవుతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు.
అభిమానులు పండగలా ఫీలవుతున్నారు !
ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా సుజిత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి యూనిట్‌ తెలియజేస్తూ…
‘భారత్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, హై స్టాండర్డ్స్‌ టెక్నాలజీతో రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన ‘సైకో సయ్యో..’ అనే పాటకి తెలుగు, తమిళ, మళయాల భాషల్లో విపరీతమైన బజ్‌ రావటంతో చిత్ర యూనిట్‌ చాలా ఆనందంగా ఉంది. సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ అభిమానులు ఈ సాంగ్స్‌ మీద టిక్‌ టాక్‌లు, డబ్‌స్మాష్‌లు చేస్తున్నారు. ఈ సాంగ్‌లో ప్రభాస్‌ చాలా స్టైలిష్‌గా కనిపించటం అభిమానుల్ని సంతోషంలో ముంచింది. అలాగే హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ చాలా అందంగా కనిపించారు. ఈ సాంగ్‌ విడుదలని ఐదు నగరాల్లో నాలుగు భాషల్లో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి స్పెషల్‌ స్క్రీనింగ్‌ చేయటంతో వాళ్ళంతా పండగలా ఫీలవుతున్నారు. ఈ పాటని సెట్లో చిత్రీకరించారు. మరో రెండు పాటలను ఆస్ట్రియాలోని అందమైన లోకేషన్స్‌లో, ఇంకో పాటని కృయేషియాలో షూట్‌ చేశారు. ఈ సాంగ్‌ని 50 మంది మిస్‌ కురేషియా మెడల్స్‌తో షూట్‌ చేశారు. అలాగే అబుదాబిలోని చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్యర్యంలో ముంచెత్తుతాయి. జిబ్రాన్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ప్రత్యేకంగా నిలవనుంది.