ప్రేక్షకులకు ప్రభాస్ ‘సాహో’ సర్‌ప్రైజ్‌

ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘సాహో’. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధాకపూర్‌ నటిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌, విక్కీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రమోషన్‌కి సంబంధించి కథానాయకుడు ప్రభాస్‌ తన అభిమానులతోపాటు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ప్రమోషన్స్‌లో భాగంగా ‘సాహో’ సర్‌ప్రైజ్‌ పోస్టర్ ను ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసారు.
‘యువీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీ, ప్రమోద్‌, విక్కీలు ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ బర్త్‌డే కానుకగా విడుదల చేసిన ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1’కి ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ వచ్చింది. అలాగే కథానాయిక శ్రద్ధాకపూర్‌ బర్త్‌డే నేపథ్యంలో విడుదల చేసిన ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2’లో శ్రద్ధా లుక్‌ని రివీల్‌ చేశారు. శ్రద్ధా లుక్‌ కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్‌ స్టాండర్స్‌తో ఉన్న మేకింగ్‌ హైలైట్‌గా నిలిచింది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్‌ని క్యాప్చర్‌ చేయటం విశేషం.
ఇంతటి భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘రన్‌ రాజా రన్‌’ చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్న సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సాహో’ని ఆయనతో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులందరూ కలిసి ఓ విజువల్‌ వండర్‌లా తీర్చిదిద్దుతున్నారు. బాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ త్రయం శంకర్‌ – ఎహసాన్‌-లాయ్ సంగీతమందిస్తున్నారు. హిందీ రిలిక్స్‌ను ప్రముఖ బాలీవుడ్‌ గీత రచయిత అమితాబ్‌ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ మధి, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబుసిరిల్‌, ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ వంటి అగ్ర సాంకేతిక నిపుణులు ఈచిత్రానికి పని చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులు, అభిమానుల అంచనాలను అందుకునేలా ‘సాహో’లో ప్రభాస్‌ చాలా స్టయిలీష్‌గా, ఓ కొత్త ఎనర్జీతో కనిపించబోతున్నారు.