జేమ్స్‌బాండ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ !

‘బాహుబలి’ ప్రభాస్ ‘సాహో’… చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల ‘సాహో’ మేకింగ్ షేడ్స్ పేరుతో ఓ వీడియో విడుదలయ్యాక అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ వీడియోలో ఎడిటింగ్ చేయని షాట్స్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఇటీవల రఫ్ ట్రైలర్ ఒకటి కట్ చేశారట. ప్రమోషన్ కోసం ఉద్దేశించిన ఈ వీడియోను బాగా దగ్గరి వాళ్లకు మాత్రమే చూపించి వారి స్పందనను బట్టి మార్పులు చేయాలని ఆలోచించారట ఫిల్మ్‌మేకర్స్. అందులో భాగంగా అలా రఫ్‌గా ఎడిట్ చేసిన ట్రైలర్‌ను ఓ సీనియర్ నిర్మాతకు ప్రివ్యూ వేశారు. అందులో సీజీ వర్క్ కూడా లేదు. ఆన్‌లొకేషన్‌లో తీసిన రషెస్‌ను తీసుకొని ఆ ఫుటేజ్ సహాయంతో దీన్ని చేయించారు. ఇది చూసిన నిర్మాత ఆశ్చర్యపడిపోయారట. ఈ రఫ్ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ జేమ్స్‌బాండ్ మూవీ చూస్తున్నట్టు ఫీలింగ్ కలిగిందని ఆయన చెప్పారట. దీంతో ‘సాహో’ టీమ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయిందని తెలిసింది. ఆతర్వాత మరో ఇద్దరికి ఈ రఫ్ ట్రైలర్ చూపిస్తే అంతకు మించిన స్పందన వచ్చిందట. ఇక ‘సాహో’ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడానికి దర్శకుడు సుజిత్ ఎంతో కష్టపడుతున్నారు. అయితే సినిమా విడుదల విషయంలో ఫిల్మ్‌మేకర్స్‌కు ఇంకా క్లారిటీ లేదు. మరో రెండు, మూడు నెలల తర్వాత ఓ నిర్ణయానికి రావచ్చు.