చాలా కొత్తగా ‘47డేస్’ మోషన్ పోస్టర్ !

కొత్తగా వస్తోన్న కుర్రాళ్లు కొత్త కాన్సెప్ట్స్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీని కూడా ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఆ విషయంలో వాళ్లు సినిమా వరకూ కాదు.. జస్ట్ ఫస్ట్ లుక్ నుంచే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా ఇన్నోవేటివ్ గా వెళుతున్నారు.. లేటెస్ట్ గా సత్యదేవ్, పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ లీడ్ రోల్స్ లో నటించిన ‘47డేస్’ (‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’) అనే కొత్త సినిమా కూడా అందరినీ ఇంప్రెస్ చేస్తుందిప్పుడు. ఫస్ట్ లుక్ కే ఇండస్ట్రీ నుంచి అప్లాజ్ వచ్చింది. దసరా సందర్భంగా విడుదల చేసిన ప్రీ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే సినిమా చాలా కొత్తగా ఉండబోతోందనే విషయం అర్థమౌతుందంటున్నారు ఫిలిం నగర్ జనాలు.. అందుకు తగ్గట్టుగానే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రేసీగా సాగే థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు దర్శక నిర్మాతలు.

ఈ మూవీతో ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జ్యోతిలక్ష్మి, ఘూజీ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ కు హీరోగా ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మోషన్ పోస్టర్ కు వచ్చిన స్పందన చాలా హ్యాపీగా ఉందని.. త్వరలోనే ఇంట్రస్టింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు నిర్మాతలు దబ్బార శశిభూషన్ నాయుడు, రఘుకుంచే, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ..

సత్యదేవ్, పూజా ఝావేరి, రోషిణి, రవి వర్మ,బిగ్ బాస్ హరితేజ,ఇర్ఫాన్, బేబి అక్షర,శ్రీకాంత్ అయ్యంగార్, ముక్తార్ ఖాన్, సత్య ప్రకాష్, కిరీటి, అశోక్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

పబ్లిసిటీ డిజైనర్స్: అనీల్ భాను, స్క్రిప్ట్ అసిస్టెంట్స్ : కిరణ్ కట్టా, హరీష్ సజ్జా,ఫస్ట్ఎడి:రాజ్ కుమార్ కోసన, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: నానాజి పెట్లా,పిఆర్వో: సురేష్ కుమార్,  పబ్లిసిటీ ఇన్ ఛార్జ్: విశ్వ సి.యమ్, లిరిక్స్: భాస్కర్ బట్ల,లక్ష్మీభూపాల్,విశ్వ,కొరియోగ్రఫీ: నిక్సన్ డిక్రూజ్, స్టంట్స్:  స్టంట్స్ శ్రీ,  ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి, ఎడిటర్: ఎస్.ఆర్. శేఖర్, మ్యూజిక్: రఘుకుంచే. సినిమాటోగ్రఫీ: జీకె,  కో ప్రొడ్యూసర్ : అనిల్ కుమార్ సోహని, నిర్మాతలు: దబ్బార శశిభూషన్ నాయుడు, రఘుకుంచే ,శ్రీధర్మక్కువ,విజయ్ శంకర్ డొంకాడ, కథ,కథనం,మాటలు,దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి