ఇతర వ్యాపారాల పైనే ఎక్కువ ఫోకస్ !

ప్రేక్షకుల్లో కొందరు హీరోయిన్లకు  గుర్తింపు ఉంటుంది కానీ, వారికి అవకాశాలు మాత్రం అంతగా ఉండవు. అలాంటి హీరోయిన్లలో ప్రణీత ఒకరు. తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోతుందని భావించిన ఈ కన్నడభామ  స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినా, మెయిన్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి క్రేజీ హీరోల సరసన నటించినా ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్‌కే పరిమితం అయ్యింది.  ఒకప్పుడు సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ అందాల భామ ఇప్పుడు ఇతర వ్యాపారాల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోందట. టాలీవుడ్‌లో ఆఫర్లు లేకపోయినా …ఆమెకు ఈ రకమైన అవకాశాలు బాగానే వస్తున్నాయట.
 ప్రస్తుతం శాండల్ వుడ్, కోలీవుడ్‌లలో కొన్ని అవకాశాలు దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ, బెంగళూరులోని తన పబ్ బిజినెస్ విస్తరించడంపై ఎక్కువగా ఫోకస్ చేస్తోందని ఆమె గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు. మరోవైపు టాలీవుడ్‌లో మాత్రం ప్రణీత ఖాతాలో సినిమాలు ఏమీ లేవని సమాచారం. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి ఈవెంట్స్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ ముద్దుగుమ్మ ఆసక్తి చూపిస్తోందట.ఇలాంటి ఈవెంట్స్‌కు కొద్దోగొప్పో పాపులారిటీ ఉన్నతారలు అవసరం కాబట్టి, కాస్త తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే ప్రణీత వంటి వాళ్లకు ఈవెంట్ మేనేజర్లు  ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. గడిచిన కొన్ని నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదికి‌పైగా షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్‌లో ప్రణీత సందడి చేసిందట. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోవడంతో ప్రణీత తన గ్లామర్‌ను ఈ రకంగా క్యాష్ చేసుకోవాలని ఇలాంటి ఆఫర్లకే ప్రణీతఎక్కువగా ప్రయారిటీ ఇస్తోందని టాక్ వినిపిస్తోంది.