ప్రేమ్ సుప్రీమ్ ‘తూనీగ’ చిత్రం స్వ‌రాల వేడుక

– ఆప్త వాక్యం : రాజ్ కందుకూరి..మ‌రుధూరి రాజా
– బిగ్ సీడీ విడుద‌ల : రాజ్ కందుకూరి..దర్శ‌కుని మాతృమూర్తి ప్రభావతి
– మార్కెటింగ్ : మ్యాంగో మ్యూజిక్
 
కూలి జనం జాతర దగ్గర ఊరు సిక్కోలు
పస్తులే పరమార్థం అని గ్రహించిన ఊరు మా సిక్కోలు
అలాంటి ఊరిలో ఒక కుర్రాడు
అలాంటి ఊరిలో కొందరు కుర్రాళ్లు
కలిసి చేసిన ప్రయత్నం..రూపొందించిన చిత్రం తూనీగ..
కొత్తతరం దిద్దుతున్న ఓనమాలివి..
ఆదరించాలి మీరు.. ఆనందించాలి మీరు..
అంటూ..ఓ సిక్కోలు కుర్రాడు చేస్తోన్న విన్న‌పం ఇది.వినీత్, దేవ‌యానీ శ‌ర్మ జంటగా న‌టించిన తూనీగ చిత్రం స్వ‌రాల వేడుక రా మానాయుడు స్టూడియోస్ లో వైభ‌వోపేతంగా జ‌రిగింది.ద‌ర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్ త‌న సినీ ప్ర‌యాణం గురించి వివ‌రించారు.ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి,మాటల ర‌చ‌యిత మ‌రుధూరి రాజా అతిథిగా విచ్చేసి యూనిట్ కు శుభాభినంద‌న‌లు తెలిపారు. ఈ చిత్రానికి పాట సాహిత్యం బాలాజీ,విస్సు, ఫ‌ణి అందించగా, వీటిని క‌రీముల్లా,యామిని,విశ్వ‌,ఇషాక్,హ‌రిగౌర హృద్యంగా ఆల పించారు.ఆడియోను మ్యాంగో మ్యూజిక్ సంస్థ మార్కెట్లోకి విడుద‌ల చేశారు.ఆ..వివ‌రాలివి..
 
ఓ సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చిన తాను, శ్రీ‌కాకుళం దారుల నుంచి ఇక్క‌డిదాకా ప్ర‌యాణించిన క్ర‌మాన ఎన్నో అవ‌స్థ‌లు, ఆటుపోట్లు దాటుకుని వ‌చ్చాన‌ని భావోద్వేగ భ‌రితంగా తూనీగ ద‌ర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్ స్పందించారు.ఫిల్మ్ న‌గ‌ర్‌, రామానాయుడు స్టూడియోలో తూనీగ చిత్ర స్వ‌రాల వేడుక‌ను యూనిట్ స‌భ్యుల కుటుంబ స‌భ్యులు, ఇతర సినీ అభిమానుల కేరింతల న‌డుమ నిర్వ‌హించారు.ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.ఇటీవ‌ల విడుద‌ల‌యిన చిన్న చిత్రాలన్నీ బాక్సాఫీసుకు బొనాంజాగా నిలిచాయ‌ని, అదే క్ర‌మంలో ఈ సినిమా చేరాల‌న్న‌ది త‌న అభిమ‌తం అ న్నారు.త‌న‌కూ ఉత్త‌రాంధ్ర నేల‌తో మంచి అనుబంధం ఉంద‌ని గుర్తుచేసుకున్నారు.నాన్న స‌ద్గురు శివానంద‌మూర్తి ఆశ్ర‌మం విశాఖ జిల్లా, భీమునిప‌ట్నం, ఆనంద‌వ‌నంలో ఉంద‌ని, ఆ నేల అంటే త‌మ‌కెంతో ఇష్ట‌మ‌ని, మ‌రో మారు త‌న తండ్రి అయిన స‌ద్గురువును స్మ‌రించుకున్నారు.
 
చింత‌ల‌న్నీ.. వెత‌ల‌న్నీ తీర్చే సినిమా కావాలి : మ‌రుధూరి
సీనియ‌ర్ డైలాగ్ రైట‌ర్ మ‌రుధూరి రాజా మాట్లాడుతూ.. ఉత్త‌రాంధ్ర అంటే ఉద్య‌మాల గ‌డ్డ అని, అలాంటి నేల నుంచి వ‌చ్చిన ద ర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్ ఈ చిత్రం కోసం ఎంతో క‌ష్టించార‌ని, ఎన్నో అవ‌స్థ‌లూ, ఆటుపోట్లూ ఎదుర్కొ న్నార‌ని, ఈ వేళ ఈ స్వ‌రాల పండుగ‌లో ఆ క‌ష్టం అంతా మ‌రిచి,తొలి ప్ర‌య‌త్నంతోనే విజ‌యం సాధించాల‌ని దీవించారు.ముందున్న కాలాన మ‌రిన్ని చిత్రాలు తీసేందుకు స‌న్న‌ద్ధం కావాల‌ని సూచించారు.ప్ర‌చార చిత్రాలు విడుద‌ల అయిన నాటి నుంచి సామాజిక మాధ్య‌మాల్లో చిత్రంపై మ రింత ఆస‌క్తి పెరిగింద‌ని, చిత్ర ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వర్తిస్తూ, క్రియెటివ్ రైటింగ్స్ అందించిన వ‌ర్థ‌మాన ర‌చ‌యిత ర‌త్న‌కిశోర్ శంభు మహంతి త‌న‌కు అత్యంత ఆప్తుడ‌ని, సోదర స‌మానుడని అన్నారు.ఆన్ లైన్ మాధ్య‌మాల్లో ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి చ‌ర్చ న‌డుస్తోంద‌ని, అందుకు ఓ కార‌ణం అన్ని మీడియాలూ అందించిన గొప్ప స‌హాకారమేన‌ని, చిన్న చిత్ర‌మే అయినా, ఇది ఎన్నో చిం త‌లు తీర్చే చిత్రం కావాల‌ని ఆకాంక్షించారు.ఎంద‌రో జీవితాలు ముడిప‌డి ఉన్న చిత్రంగా ఇది రూపొందిందని, వారి రంగుల కలలు ఈ రంగులో లోకాన ఫ‌లిస్తే తానెంతో ఆనందిస్తాన‌ని అన్నారు.ఉత్త‌రాంధ్ర నేలతో మా అన్న‌య్య,ర‌చ‌యిత ఎంవీఎస్ హరనాథ‌రావు కు కూడా ఎంతో అనుబంధం ఉన్న రీత్యా ఇది త‌న కుటుంబ పండుగ అని వ్యాఖ్యానించి చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నిం పారు.
 
ఇదీ నా ప్ర‌యాణం.. ఇదీ నా ప్ర‌స్థానం : డైరెక్ట‌ర్ ప్రేమ్
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్ఫూర్తితో ఏడాది కింద‌ట ప‌ట్టాలెక్కిన చిత్రం ఇది.అంతకుమునుపు కొన్ని ల‌ఘు చిత్రాలు తీశా ను.ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణుడ్ని కాగానే సినిమాపై పిచ్చితోనో ఇటుగా వ‌చ్చి, చిన్న చిన్న ప‌నులు చేసుకుని, ఈ భాగ్య‌న‌గ‌రి దారుల్లోనే ఇంట‌ర్ ను దూర విద్య ద్వారా పూర్తిచేశాను.తరువాత దిల్ సుఖ్ న‌గ‌ర్ లో ఉన్న ఎరీనా మ‌ల్టీ మీడియాలో మాయా కోర్సు చేశా ను.కొన్ని కారణాల రీత్యా మా స్వ‌స్థ‌లం శ్రీ‌కాకుళం చేరుకున్నాను. ఇక్క‌డికి వ‌చ్చేక బీకామ్ పూర్తిచేశాను.చిరుద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న..నాన్న హ‌ఠాన్మ‌ర‌ణంతో మా జీవితాలు అత‌లాకుత‌లం అయ్యాయి.తేరుకుని మ‌ళ్లీ అదే త‌ప‌న‌తో చిన్న, చిన్న చిత్రాలు రూపొందించి, ఇప్పుడీ చిత్రాన్ని క్రౌడ్ ఫండింగ్ తో పూర్తి చేశాను.ఈ చిత్ర నిర్మాణంలో ఎంద‌రెంద‌రో సాయం చేశారు.స్వరాలు అందించిన ‘క్ష‌ణం’ ఫేం సిద్ధార్థ స‌దాశివుని, డీఓపీ అందించిన ‘వంగ‌వీటి’ ఫేం హ‌రీష్ ఎదిగ, మా త‌ప్పులు దిద్దిపెట్టిన ఎడిట‌ర్ ఆర్కే ఇలా అంతా అంతా స‌మ‌న్వంతో ప‌నిచేసి, మంచి ఔట్ పుట్ ఇచ్చారు.
చిత్రానికి వినూత్న ప్ర‌చారం అవ‌స‌రం అని భావించి మా శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రానికి చెందిన వర్థ‌మాన ర‌చ‌యిత ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి ఆన్ లైన్ మాధ్య‌మాల స‌హ‌కారం తో ప్రోమో పోస్టర్ల‌ను ప్ర‌త్యేకించి డిజైన్ చేయించారు.వీటిని ఆర్టిస్టులు బాబు దుండ్ర‌పెల్లి, గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లి, ధ‌నుంజ‌య అండ్లూరి రూపొందించారు.ఈ సినిమా కు సంబంధించి తొలి వేడుకకు త‌నికెళ్ల భ‌ర‌ణి నేతృత్వం వ‌హించి, పోస్ట‌ర్ ను విడుద‌ల చేసి మ‌మ్మ ల్ని ఆశీర్వ‌దించారు.తరువాత చిత్ర ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ర‌త్న‌కిశోర్ రూపొందింపజేసిన డిజిట‌ల్ పోస్ట‌ర్స్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు వేణు ఊడుగుల త‌న ట్విటర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. వారిరువురికీ, ఇంకా.. ఆన్ లైన్ , ప్రింట్ మీడియాల్లో ప‌నిచేసిన పాత్రికేయుల‌కూ, సంబం ధిత సంస్థ‌ల‌కూ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.అలానే ఇటీవ‌ల రికార్డు చేసిన ప్రోమో డైలాగ్ కు టీవీ9 ఫేం శ్రీ‌నివాస ఫ‌ణిధ‌ర్ గొంతుక అందించారు. త్వ‌ర‌లోనే ఈ డిజిట‌ల్ డైలాగ్ ను విడుద‌ల చేయ‌నున్నాం. స్థూలంగా చెప్పాలంటే ఇది ఒక సామాన్యుని చిత్రం.. ర‌మేశ్ నారాయ‌ణ్, చెర్రీ రామ్, కొండ‌న్న వంటి స్నేహితుల సాయంతో దృశ్య‌మానం చెందిన ఓ చంద‌మామ క‌థ‌.. ప్రోమో పోస్ట‌ర్ లో చెప్పిన విధంగా ఇది ఒక ఇతిహాస త‌రంగం.ఆద‌రించండి.. ఆశీర్వ‌దించండి..
 
స్వ‌రాల సందడిలో..రాగాల ప‌ల్ల‌కిలో..
స్వరాల వేడుకలో యూనిట్ సభ్యులు సందడి చేశారు.హీరో వినీత్ చంద్ర తో స‌హా ఇత‌ర న‌టీన‌టులు వారి వారి అనుభవాలను పంచుకున్నారు.సినిమాకు తమదైన సహకారం అందించిన శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం, సిరిపురం గ్రామ ప్రజలకు ధ న్యవాదాలు తెలిపారు.ఈ స్వ‌రాల వేడుక‌కు అతిథులుగా ప్రొడ్యూసర్ దేవీగ్రంథం, నెపోలియెన్ మూవీ ప్రొడ్యూసర్ బొగేంద్ర గుప్త మామిడిపల్లి,ఫిల్మ్ ఛాంబర్ మెంబర్ పద్మిని నాగులపల్లి, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు,యంగ్ హీరో మనోహర్ విచ్చేశారు.తొలి సీ డీని చిత్ర స‌మ‌ర్ప‌కులు ప‌ద్మావ‌తి , దేవీ ప్రియ సంయుక్తంగా అందుకున్నారు.వ్యాఖ్యాతగా ప్ర‌ణీత వ్య‌వ‌హ‌రించారు.
కార్య‌క్రమం లో సంగీత ద‌ర్శ‌కులు సిద్ధార్థ్ స‌దాశివుని, సినిమాటొగ్ర‌ఫర్ హ‌రీష్ ఎదిగ, పోస్ట‌ర్ డిజైన‌ర్ ఎంకేఎస్ మ‌నోజ్, ప్రోమో డైలాగ్, లిరి కల్ వీడియోస్ ఎడిట‌ర్ నికిల్ కాలేపు, పాట‌ల ర‌చ‌యిత‌లు కిట్టు, ఫ‌ణి , గాయ‌కులు క‌రీముల్లా, విశ్వ‌,ఇషాక్, స‌హ నిర్మాత క‌ర్రి ర‌మేశ్, న‌టీన‌టులు సిల్వ‌ర్ సురేశ్, చైత్రిక, త‌దిత‌ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.