‘ప్రేమపందెం’ ఆడియో, ట్రైలర్‌ లాంఛ్‌ !

శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రవణ్‌, మీనాక్షి గోస్వామి, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబశివ  ప్రధాన పాత్రధాయిగా నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఈ చిత్రం ఆడియో విడుదల, ట్రైలర్‌ లాంఛ్‌ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ ఆడియో సీడీని విడుదల చేశారు.
ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ.. ‘ప్రేమపందెం’తో పాటు సక్సెస్‌ పందెంలో కూడా ఈ సినిమా విజయం సాధించాని కోరుకుంటున్నా. చాలా చిన్న సినిమాలు షూటింగ్‌ దశలోనే ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. కానీ ఈ చిత్ర నిర్మాత లక్ష్మీ నారాయణ గారు సినిమాను విడుదల కూడా చేస్తుండడం నిజంగా అభినందనీయం. నా తరపున ఏ సహాయం కావాలన్నా చేస్తానని మాట ఇస్తున్నా అన్నారు. తెంగాణ ఫిలిం ఛాంబర్‌ కార్యదర్శి యన్‌ సాయివెంకట్‌ మాట్లాడుతూ.. సినిమాలో ఆర్టిస్ట్‌లు అందరూ కొత్తవారు అయినప్పటికీ చక్కగా నటించారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా అన్నారు.
చిత్ర సంగీత దర్శకుడు వెంకట్‌  మాట్లాడుతూ.. పాటలు ఇంత చక్కగా రావడానికి నా సాహిత్య రచయిత సహకారం ఎంతో ఉంది. అలాగే దర్శక, నిర్మాతలు కూడా సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు అన్నారు. నిర్మాత ఎం.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథలో ఓ చిన్న పాయింట్‌ నన్ను బాగా ఆకట్టుకుంది. అదేమిటో తెరమీద చూస్తేనే బాగుంటుంది. మా యూనిట్‌ సభ్యులు అందరూ తమ చిత్రంగా భావించడం వల్ల ఇంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం సాధ్యమైంది. త్వరలోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం. మా ఈ తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు దర్శకుడు ఎం.ఎం.అర్జున్‌
అర్జున్‌ మాట్లాడుతూ.. వెంకట్‌ ఎస్‌.వి.హెచ్‌. అద్భుతమైన స్వరాలు అందించారు. వాటి తగ్గట్టు సాహిత్యం కూడా బాగా కుదిరింది. ప్రేమపందెం అంటే  యూత్‌ సినిమానే కాదు. ఇందులో అన్ని రకాల ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నారు.  ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా విజయం సాధించాలని తమ ప్రసంగాల్లో ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శ్రవణ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, సునీత, చైతన్య, దేవిక, శ్రీలేఖ ,కోట శంకర్రావు, బస్టాప్‌ కోటేశ్వరరావు, సీనియర్‌ వినోద్‌, సుజాత, ధర్మతేజ, హాసిని, ఓబయ్య మొదగువారు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాటు: ఓబుయ్య, ఎడిటింగ్‌: సంతోష్‌, సంగీతం: వెంకట్‌ ఎస్‌.వి.యు., రీరికార్డింగ్‌: మహీధరన్‌, కొరియోగ్రఫీ: శామ్యూల్‌, కెమెరా: అమర్‌ జి., సహకారం శరత్‌సాగర్‌, కో ప్రొడ్యూసర్‌: ఓబయ్య సోమిరెడ్డిపల్లె, కో డైరెక్టర్‌: గణేష్‌ ముత్యా. పి.ఆర్‌.ఓ: ‘సింహాసనం’ సురేష్‌, నిర్మాత: ఎం.లక్ష్మీనారాయణ, కథ, కథనం, దర్శకత్వం: ఎం.ఎం. అర్జున్‌.