`ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌` ఫిబ్రవరి 22న

హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ‌, అక్షిత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం` ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌`. భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో జె.ఎస్. ఆర్ మూవీస్ ప‌తాకంపై జొన్న‌ల‌గడ్డ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ నిర్మిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని పిబ్రవరి 22న సినిమా రిలీజ్ అవుతోంది.
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ… సినీ ప‌రిశ్ర‌మ‌లో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాను. చాలా మంది పెద్ద హీరోల సినిమాల‌కు ప‌నిచేసాను. ద‌ర్శ‌కుడిగా నాకిది తొమ్మిద‌వ సినిమా. క‌థ వైవిథ్యంగా ఉంద‌నే నా కుమారుడిని ఈ సినిమా తో హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నా. రెగ్యుల‌ర్ ల‌వ్ స్టోరీల‌కు భిన్నంగా ఉంటుంది. ఇప్ప‌టికే చాలా ల‌వ్ స్టోరీలు వ‌చ్చాయి. కానీ ఇలాంటి పాయింట్ ఇప్ప‌టివ‌ర‌కూ ఏ డైరెక్ట‌ర్ ట‌చ్ చేయ‌లేదు. క్లైమాక్స్ ఆద్యంత ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఇటివల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కదానుసారంగా వస్తాయి. ఖర్చు కు వెనుకాడకుండా తెరకెక్కించడం జరిగింది. ఇండ‌స్ర్టీలో పెద్ద‌లంద‌రి సహ‌కారం…సూచ‌న‌ల‌తో పిబ్రవరి 22వ తేదిన రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా ఇది` అని అన్నారు.
 
హీరో హ‌రికృష్ణ మాట్లాడుతూ… ` అన్ని జ‌న‌రేష‌న్ల‌కు క‌నెక్ట్ అయ్యే ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. సినిమా చూస్తే ఓ కొత్త క‌థ‌ను చూస్తున్నామ‌నే అనుభూతి క‌లుగుతుంది. ప్రేమలో బాధ‌ను సినిమా తెలియ‌జేస్తుంది. ప్రేమికులైతే ఇలాంటి అనుభ‌వాలు మ‌న జీవితంలో కూడా ఉన్నాయనుకుంటారు. కథ‌లో చాలా ట్విస్టులుంటాయి. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మా సినిమాకు మీడియా కూడా మంచి ప‌బ్లిసిటీ ఇచ్చింది. త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాం` అని అన్నారు.
 
ఝాన్సీ, చిలుకూరి రంగారావు, ఎ.ఆర్. సి బాబు, రాహుల్ బొకాడియా, పింగ్ పాంగ్, రాఘ‌వ‌పూడి, రాజారావు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి క‌థ‌: జె.ఎస్. ఆర్ మూవీస్, క‌థ‌నం: భూప‌తిరాజా, మ‌రుదూరి రాజా, రాజేంద్ర కుమార్, మాట‌లు: సుబ్బారాయుడు బొంపెం, పాట‌లు: వ‌న‌మాలి, గోసల రాంబాబు, ఎడిటింగ్ : జాన‌కి రామ్, ఫైట్స్ : రామ సుంక‌ర‌, పీఆర్ ఓ: స‌తీష్‌.కె, కెమేరా: పి. ఎస్. వంశీ ప్ర‌కాశ్, కొరియోగ్ర‌ఫీ:ప‌్రేమ్ ర‌క్షిత్, విద్యాసాగర్, శ్రీధ‌న్, నిర్మాత: సావిత్రి జొన్నలగడ్డ, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం:జొన్నల గడ్డ శ్రీనివాసరావు.