టాలీవుడ్ లోకి త్వరలో దూసుకొస్తోంది !

‘చూసి చూడంగానే నచ్చేసిందే’ అంటూ  ‘ఛలో’ సినిమాలో సాగే పాట ఎంతగానో ఆకట్టుకుంది. సరిగ్గా ఈ పాటనే అక్షరాలా నిజం చేసి చూపించింది ప్రియా ప్రకాశ్ వారియర్. గ్లామర్ అంటే సిల్వర్ స్క్రీన్ పై అందాల ఆరబోతనో.. ఇంటిమెంట్ సీన్స్‌లో రెచ్చిపోవడమో కాదు.. కంటి సైగలతోనూ, క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్‌తోనూ రొమాన్స్ చేసేయొచ్చని ఈ కుర్రహీరోయిన్ రుజువు చేసింది. ఇక హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో నమోదైన పోలీసు కేసులపై స్పందించిన ప్రియా.. కేసుల గురించి తనకు తెలియదని, దర్శకుడు చెప్పింది మాత్రమే తాను చేశానంది. ఇక ముస్లిం సాంప్రదాయ గీతాన్ని తాము అవమానించామని భావించడం లేదన్న ప్రియా.. తాను ప్రదర్శించిన హావభావాల్లోనూ ఎలాంటి అసభ్యత లేదని, అనవసర వివాదాలు క్రియేట్ చేయవద్దని కోరింది.ఈ కేరళ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని తాజా సమాచారం..!
 ప్రియా ప్రకాశ్ వారియర్ ను  కొందరు తెలుగు యువ హీరోలు ఈ భామను టాలీవుడ్‌కు రప్పించేందుకు ట్రై చేస్తున్నారట.ఆమధ్య ‘ప్రేమమ్’తో మలయాళంలో క్రేజ్ అందుకున్న సాయిపల్లవి వెంటనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ప్రియా ప్రకాశ్ విషయంలోనూ ఇదే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రియా కోసం ప్రయత్నిస్తున్నారట. మెగాహీరోల సినిమాలతో పాటు యువహీరో నిఖిల్ సరసన ఈ కేరళ భామ నటించబోతోందనే వార్తలు తెరపైకి వచ్చాయి. నిఖిల్ హీరోగా ‘పెళ్లిచూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం ప్రియా ప్రకాశ్‌ను సంప్రదిస్తున్నారట. అయితే ప్రియా డేట్స్‌ను చూస్తోన్న ఆమె తొలిచిత్ర దర్శకుడు ఒమర్ లులు ఏకంగా రెండు కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఇలా కెరీర్ ప్రారంభంలోనే రెండు కోట్ల రెమ్యూనరేషన్ అంటే కష్టమే. అయినా ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా అడిగినంత మొత్తం చెల్లించేందుకు కూడా కొందరు సిద్ధంగా ఉన్నారట.