డబ్బు సంపాయించడంలో ఆమె లెక్కేవేరు !

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ …. కన్నుకొట్టి కోట్ల మంది అభిమానులను సంపాదించేసుకుంది. డబ్బులు కూడా అదేరేంజిలో సంపాదించేస్తోంది. ప్రియావారియర్‌! ప్రియావారియర్‌కి సినిమాల్లో ఎన్ని అవకాశాలొచ్చినా ‘చదువు పూర్తయిన తరువాతే’అంటూ అన్నీ తిప్పి కొడుతోంది. అదేసమయంలో వ్యాపార ప్రకటనలకు మాత్రం ఓకే చెప్పేస్తోంది. ఇప్పటికే పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రియా తాజాగా దక్షిణాదిన ఓ బట్టల షాపుకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఇలా వరుసపెట్టి యాడ్స్‌ ఒప్పుకోవడంలో ప్రియా లెక్కేవేరు అంటున్నారు సినీ జనాలు. సినిమా అంటే బోలెడన్ని రోజులు కేటాయించాలి. దాంతో చదువు డిస్టర్బ్‌ అవుతుంది. అదే యాడ్స్‌ అయితే రెండు లేదా మూడురోజులలో షూటింగ్‌ అయిపోతుంది. డబ్బుకి డబ్బు వస్తుంది.. ప్రకటనలతో అభిమానులకు ఎప్పుడూ కనపడుతూ ఉండొచ్చు. మొత్తానికి ప్రియా చాలా తెలివైన పిల్లనీ, ఆమె లేక్కే వేరుగా ఉంటుందంటున్నారు సినీ జనాలు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలకూ లక్షలు
ప్రియా ప్రకాశ్‌ కు ప్రస్తుతం భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఓ వాణిజ్య ప్రకటన కోసం రూ.కోటి డీల్‌కు ఆమె సంతకం చేసినట్లు సమాచారం. ఆ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన పలు ఫొటోలు బయటకు వచ్చాయి. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్లు ఆరు మిలియన్లకు పైగా పెరిగిపోవడంతో దాని ద్వారా కూడా ఆమె బాగా సంపాదిస్తోంది. అందులో ఆమె ఇచ్చే ఒక్కో ప్రకటనకు రూ.8 లక్షలు తీసుకుంటోంది.ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ … ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.