ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు !

ఒక్క రోజులో కావాల్సినంత పాపులార్టీ ఎవరికైనా వచ్చిందంటే అది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కే దక్కింది. ఈమె ఎవరో పరిచయం చేయనక్కర్లేని పేరు. ఎందుకంటే ఒక్క రోజులోనే నెటిజన్లందరికీ పరిచయమైంది ఈ హీరోయిన్‌. ‘ ఒరు అదార్‌ లవ్‌’ అనే మలయాళ చిత్రంలో ‘జిమ్మిక్కి కమ్మల..’ అనే గీతంలో ఆమె ప్రదర్శించిన ముఖ హావభావాలు ప్రియాను పెద్ద స్టార్‌ను చేశాయి. ఈ చిత్రం తాజా టీజర్‌లోనూ ప్రియ తన వేలును గన్‌లా పెట్టి పేల్చి భలే చేసిందనిపించింది.మార్చి 3న విడుదల కానున్న ఈ సినిమాకూ విశేషమైన క్రేజ్‌ వచ్చింది.దాంతో వివిధభాషల్లో ఈ చిత్రం విడుదలచేస్తారట. ఈ చిత్రం తెలుగులో కూడా రాబోతుందిట. తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది . ఈ చిత్రానికి ఒమర్‌ లులు దర్శకత్వం వహించారు. అందరూ కొత్తవాళ్లతోనే తెరకెకించారు ఈ దర్శకుడు. షాన్‌ రహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి మూడో తేదీన ప్రేక్షకులను ఇంకెంత ఊపేస్తుందో చూడాలి….

యువత అమాంతం పడిపోయింది !

ఆమె కన్నుగీటితే యువత అమాంతం పడిపోయింది. ఆమె కనుసైగల కదలికలకు కొత్త లోకంలో తేలిపోయినట్టు ఫిదా అయింది. ఆమె హవాభావాలు చూసి ప్రేమమైకంలో మునిగిపోయింది. ఒక్క యువత ఏంటి.. అందరూ ఈ వాలెంటైన్స్‌ డే నాడు నిండా 40 సెకన్ల నిడివిలేని ఆమె వీడియోతో ప్రేమలో పడ్డారు. ఆమె హావభావాలకు ఊగిపోయారు. తమలోని ప్రేమభావాలను తరచిచూసుకున్నారు. ఆమే ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాలోనే కాదు నేషనల్‌, లోకల్‌ మీడియాలోనూ అంతట ఆమె గురించే చర్చ. ఆమె ఎవరు అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. ఓవర్‌నైట్‌ సెన్సేషనల్‌ స్టార్‌ అయిన ఈ పదెనిమిదేళ్ల అమ్మాయిని  సూపర్‌ స్టార్లు మొదలు టీనేజ్‌ అబ్బాయిల వరకు ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు కానుకగా ఒక తూటాలాంటి ముద్దుతో యువకుడి గుండెను ప్రేమతో పేల్చేసిన ఆమె మరో వీడియోను ఆన్‌లైన్‌లో వదిలారు. ‘ఒరు ఆదార్‌ లవ్‌’ అనే మలయాళ సినిమాతో ప్రియాప్రకాశ్‌ వారియర్‌ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కనుసైగలతో, కన్నుగీటుతూ యువకుడిని ప్రేమమైకంలో ముంచెత్తే ప్రియాప్రకాశ్‌ వీడియో ఇప్పటికే సెన్సేషనల్‌ అయింది.

ఈ ఒక్క వీడియోతో ఓవర్‌నైట్‌ ఆమె నేషనల్‌ స్టార్‌ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మిలియన్‌కుపైగా ఫాలోవర్లు యాడ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో ‘ఒరు ఆదార్‌ లవ్‌’ సినిమా టీజర్‌ను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రియ.. ఒక ఫ్లయింగ్‌ కిస్‌ని గన్‌లా మార్చి తూటాలా పేల్చితే.. అది తగిలి ఆమె లవర్‌ విలవిలలాడుతాడు.