ఐశ్వర్యారాయ్ ని కూడా మించిపోయింది ప్రియా ప్రకాష్

ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే‍ పెద్ద సెలబ్రెటీగా మారిపోయింది …  దేశవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఒక్క పాటతో ఓవర్ నైట్ క్రేజ్ అందుకున్న అదృష్టవంతుల జాబితాలో ప్రియా ప్రకాశ్ వారియర్‌ను మించి మరొకరు లేరనే చెప్పాలి. లేటెస్ట్‌గా బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్‌కు కూడా దక్కని అరుదైన రికార్డును సోషల్ మీడియాలో అందుకుంది ఈ కుర్ర హీరోయిన్.
 మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’లోని ‘మాణిక్య మలరా’ పాటతో దేశవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఇప్పుడీ భామ సోషల్ మీడియా క్రేజ్ విషయంలో వరల్డ్ వైడ్ టాప్ సెలబ్రిటీస్‌కే షాక్ ఇస్తోంది. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన తొలిరోజునే ఈ రికార్డును అందుకుంది ఈ మలయాళ కుట్టి. ఇటీవల ఐశ్వర్యారాయ్ వంటి అందగత్తె ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ ఇస్తే.. 24 గంటల్లో లక్షా ఆరు వేలమంది ఫాలో అయ్యారు. ఒక రకంగా ఇది పెద్ద సంఖ్యే అయినా ప్రియా ప్రకాశ్‌తో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువే.
 ప్రస్తుతం 59 లక్షల మంది ఫాలోవర్స్‌తో దూసుకెళుతోంది ప్రియా ప్రకాశ్ వారియర్. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన 24 గంటలకే.. 6 లక్షల మంది ఫాలోవర్స్ మార్క్‌ను అందుకుంది ఈ కేరళ భామ. ప్రపంచవ్యాప్తంగా ఈస్థాయి ఫాలోవర్స్‌ను అందుకున్న వారిలో మూడో స్థానంలో నిలచింది ప్రియా. అమెరికన్ టీవీ స్టార్ అండ్ మోడల్ కైలీ జెన్నర్ (Kylie Jenner) 8 లక్షల 6 వేలతో వరల్డ్ వైడ్‌గా ప్రథమ స్థానంలో ఉండగా.. ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో 6 లక్షల 50 వేల ఫాలోవర్స్‌ను అందుకుని సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత స్థానం ప్రియా ప్రకాష్ దే. మన దేశంలో ఇలా 24 గంటల్లో అత్యధిక శాతం ఫాలోవర్స్‌ను అందుకున్న వారిలో టాప్ ప్లేస్ ప్రియదే. సో.. ఐష్ వంటి  సీనియర్స్ కంటే.. ప్రియా ప్రకాశ్ వంటి కుర్రభామలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్నమాట నెటిజన్స్.

‘వైరల్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ 

 ప్రియా ప్రకాష్… 19ఏళ్ల ఈ  యువతి సంపాదన, పాపులారిటీ  స్టార్‌ హీరో కంటే తక్కువేం కాదు. కేవలం సంపాదన, పేరు మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ అమ్మడి ఖాతాలోకి మరో గౌరవం వచ్చి చేరింది. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా కొందరు నటులను వరించని అదృష్టం ప్రియా వారియర్‌ను వరించింది. ఇంతకు ఏంటా అదృష్టం అంటే ప్రియ తన తొలి అవార్డును అందుకుంది.

అందేంటి ప్రియ నటించిన సినిమాలు ఇంతవరకూ ఒక్కటి  కూడా విడుదల కాలేదు మరి అప్పుడే అవార్డు అందుకోవడం ఏంటి అనుకుంటున్నారా? మరేంలేదు ప్రియ అందుకున్న అవార్డు సినిమాలకు సంబంధించింది కాదు, సోషల్‌ మీడియాకు సంబంధించిన అవార్డు. 2018 సంవత్సరానికి గాను ‘వైరల్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రియ సొంతం చేసుకుంది. ఇది తన జీవితంలో తాను అందుకున్న తొలి అవార్డు అని, అందుకు చాలా గర్వంగా ఉందని ప్రియా వారియర్‌ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రియా వారియర్‌ నటించిన ‘ఒరు ఆదర్‌ లవ్‌’ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.