స్ఫూర్తి దాయకమైన బ‌యోపిక్ `మ‌ల్లేశం` జూన్ 21న

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌, ఎంతో మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన వ్య‌క్తి చింత‌కింది మ‌ల్లేశం బ‌యోపిక్ `మ‌ల్లేశం` రూపొందుతుంది. బ‌యోపిక్‌లో ప్రియ‌ద‌ర్శి మ‌ల్లేశం పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాజ్.ఆర్ ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 21న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తుంది.
ఝాన్సీ, అన‌న్య స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టించారు. మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలు శాండిల్య‌స సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌రలోనే ఈసినిమా ట్రైల‌ర్‌, పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.
న‌టీన‌టులు:
ప‌్రియ‌ద‌ర్శి,ఝాన్సీ,అనన్య‌,చ‌క్ర‌పాణి
తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌క‌త్వం:  రాజ్‌.ఆర్‌
నిర్మాత‌లు:   రాజ్‌.ఆర్‌,  శ్రీఅధికారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వెంక‌ట్ సిద్ధారెడ్డి
మ్యూజిక్‌:  మార్క్ కె.రాబిన్‌,సినిమాటోగ్ర‌ఫీ:  బాలు శాండిల్య‌స‌,
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  నితిన్ లుకాసొ,డైలాగ్స్‌:  పెద్దింటి అశోక్ కుమార్‌
పాట‌లు:  గొరేటి ఎంక‌న్న‌, చంద్ర‌బోస్‌, దాశ‌ర‌థి,సౌండ్ డిజైన్‌:  నితిన్  లుకాసొ
క్రియేటివ్ కన‌ల్లెంట్‌, ఎడిట‌ర్‌: శ‌్రీనివాస్‌,డైరెక్ట‌ర్ ఆఫ్ యాక్టింగ్‌: మ‌హేష్ గంగిమ‌ల్ల‌
ఎడిటింగ్‌:  రాఘ‌వేంద్ర‌.వి,క‌ల‌రిస్ట్‌:  శ్రీనివాస్ మామిడి