మా రిజిస్టర్‌ మ్యారేజ్‌ సరైన పనే !

గ్లామర్ నటిగా దక్షిణాది సినిమాల్లో  కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తించిన ప్రియమణి ఈ నెల‌లోనే పెళ్లి కూతురు కానుంది. కొద్ది రోజుల క్రితం బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ తో నిశ్చితార్ధం జరుపుకున్న ఈ అమ్మడు ఆగస్ట్ 23న పెళ్ళిపీట‌లెక్క‌నుంది. ఈ వివాహం చాలా గ్రాండ్ గా కాకుండా , రిజిస్ట్రేషన్ ఆఫీసులో సింపుల్ గా జరగ‌నున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై ప్రియ‌మ‌ణి క్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది…. ‘మేము విభిన్న మతాలకు చెందిన వాళ్లం. అందుకే సంప్రదాయబద్ధంగా కాకుండా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటున్నాం. ప‌ర‌స్ప‌ర‌  అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది సరైన పనే. పెళ్లి జరిగిన రెండు రోజుల తర్వాత నుంచే షూటింగ్‌కు వెళ్తా. నేను విరామం తీసుకోను.. ఎందుకంటే వరుసగా నాకు సినిమాలు ఉన్నాయి’ అని ప్రియమణి చెప్పారు.

ప్ర‌స్తుతం మలయాళంలో ‘సైలంట్‌ రేడియో’, ‘పెర్ఫ్యూమ్‌’, ‘యస్‌ ఐ యామ్‌’, ‘పెయింటింగ్‌ లైఫ్‌’, ‘గ్రాండ్‌ మాస్టర్‌ 2’, ‘సత్యాన్వేషణ పరీకణగళ్‌’ సినిమాలతో బిజీగా ఉంది. పెళ్ళైన రెండు రోజులకే తాను షూటింగ్ లో పాల్గొన‌నున్న‌ట్టు ప్రియ‌మ‌ణి అంది. ప్రియమణి ప్రేమాయణం ఓ డ్యాన్స్ షో ద్వారా సాగిన సంగ‌తి తెలిసిందే. ముస్తఫాను తొలిసారిగా ఓ డ్యాన్స్ షోలో కలిసిన ఈ అమ్మడు.. ఆ పరిచయాన్ని ప్రేమగా, ఆ తర్వాత వివాహం గా మార్చుకుంటుంది. ఈ అమ్మ‌డు తెలుగులో నటించిన చివరి చిత్రం ప్రకాష్ రాజ్ ‘మన ఊరి రామాయణం’.