అవార్డుల వేడుకలో డ్యాన్స్ కు అన్ని కోట్లా ?

బాలీవుడ్‌లో స్టార్ హీరోల రెమ్యునరేషన్‌లు ఈమధ్యన ఆకాశాన్నంటాయి. కొందరు హీరోల సినిమాలు విడుదలైన మొదటి వీకెండ్‌లోనే వంద కోట్ల కలెక్షన్లను అందుకుంటున్నాయి. దీంతో వారు పెద్ద మొత్తంలో పారితోషికాన్ని తీసుకుంటున్నారు. అయితే వీరితో కలిసి నటిస్తున్న స్టార్ హీరోయిన్ల పారితోషికం కూడా  భారీగానే ఉంటోంది. వారు కూడా ఈమధ్యన హీరోల లెవెల్‌లో రెమ్యునరేషన్‌ను అడిగేస్తున్నారు. ఇటువంటి బాలీవుడ్ భామల్లో ప్రియాంకచోప్రా, దీపికా పదుకునే, కత్రినాకైఫ్‌లు ముందుంటారు. ఇక ఈ భామలు సినిమాలకే కాదు పలు ఫంక్షన్‌లలో డ్యాన్స్‌లు చేయడానికి కూడా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇదేవిధంగా డిసెంబర్‌లో జరుగబోయే ఒక అవార్డుల వేడుకలో ప్రియాంక చోప్రా డ్యాన్స్ చేయడానికి ఏకంగా రూ.12 కోట్లు కావాలని అడిగిందట. ఆ వేడుకలో 30 నిమిషాలు డ్యాన్స్ చేయడానికే ఈ హాట్ బ్యూటీ అంత పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడంతో నిర్వాహకులు ఏమీ మాట్లాడలేకపోయారని తెలిసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. కొన్ని హాలీవుడ్ టివి సీరియల్స్‌లో కూడా ఆమె నటించింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ప్రియాంక పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తోందట.