నటులకు కాదు.. విషయానికే ప్రేక్షకుల ప్రాధాన్యత!

“ఆ టైమ్‌లో సినిమాల్లో హీరోయిన్‌ ఎవరు అనేది హీరోనే నిర్ణయించేవారు. కథానాయికలను కేవలం ఆటబొమ్మలుగానే అప్పుడు చూసేవారు”…అంటూ ప్రియాంక చోప్రా తాను బాలీవుడ్‌లో నటిగా కెరీర్‌ ప్రారంభినప్పటి పరిస్థితులను.. నేటి పరిణామాలతో పోలుస్తూ చెప్పారు .ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. కానీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు అగ్ర హీరోలు, నటులకు కాకుండా కంటెంట్‌కే ప్రేక్షకులు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొంది. మనం చూస్తున్న పెద్ద మార్పుల్లో అదొకటి.నేను ‘ఫ్యాషన్’ సినిమా చేసినప్పుడు..ఇక అ హీరోయిన్లు మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటిస్తారు అని చెప్పారు. ఆ తర్వాత ‘ఐత్రాజ్’ సినిమాలో నటిస్తే.. ‘ఈ సినిమా చేయొద్దు అందరూ నిన్ను వేశ్యగానే చూస్తారు’ అని హెచ్చరించారు. నా ఇమేజ్ పాడవుతుందని భయపెట్టారు. ఏదైతే అయ్యిందని ఆ సినిమా చేసేశాను’’
 
‘‘నాకు నేర్పించేవారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు మనకు దీపిక పదుకొణె, ఆలియా భట్, కంగనా రనౌత్, విద్యా బాలన్ లాంటి నటీమణులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ‘ఇలాంటి కథలను చెప్పాలని అనుకుంటున్నాం. మేం ఎంత మంచి కథల్లో నటిస్తామంటే.. మీ అంతట మీరే థియేటర్లకు పరుగులు తీస్తారు’ అని అంటున్నారు. అయితే, అప్పట్లో అలాంటి సినిమాలే నేను చేసినప్పుడు చాలా తక్కువ మంది అలాంటి సినిమాల్లో నటిస్తుండేవారు’’ అని ప్రియాంక తెలిపారు.
 
ప్రియాంక గతేడాది సోనాని బోస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ ది స్కై ఈజ్‌ పింక్‌’ చేసింది. ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వాసిమ్‌ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ‘ఫ్రోజెన్‌’కు హిందీలో తన చెల్లి ప్రరిణీతి చోప్రాతో కలసి గొంతును అరువిచ్చారు. ప్రస్తుతం ‘ది వైట్‌ టైగర్‌’ అనే చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌తో కలసి చేస్తోంది .ఇది నెట్‌ఫ్లిక్‌ నిర్మిస్తుంది. ఇది కాకుండా సూపర్‌ హీరోస్‌ సినిమా ‘వియ్ కెన్‌ బి హీరోస్‌’ చేస్తుంది. అమెజాన్‌ వెబ్‌ సిరీస్‌ ‘సీటాడెల్‌’లో నటిస్తుంది.
 
అందుకు చాలా గర్వంగా ఉంది
‘ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు మా ‘పానీ’ సినిమాకి వస్తుందని ఊహించలేదు. అవార్డు రావడమనేది నమ్మలేకపోతున్నా. అందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సమయంలో నేనక్కడ లేను. ఈ అవార్డు అందుకున్నందుకు, ఇంతటి అద్భుతమైన సినిమాని తెరకెక్కించిన దర్శకుడు అదినాథ్‌కి ధన్యవాదాలు’
..అని ప్రియాంకచోప్రా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రియాంక చోప్రా ‘గ్లోబల్‌ స్టార్‌’గా రాణించడం ఓ విశేషమైతే..అభిరుచి గల నిర్మాతగా ప్రాంతీయ ప్రతిభని ప్రోత్సహిస్తూ సినిమాలను నిర్మించడం మరో విశేషం. కాన్సెప్ట్‌ చిత్రాలను, ప్రాంతీయ భాషా చిత్రాలను నిర్మించి.. నిర్మాతగానూ తానేమిటో నిరూపించుకున్నారు. ఇటీవల మరాఠిలో నిర్మించిన ‘పానీ’ చిత్రానికి ‘పర్యావరణ పరిరక్షణ విభాగం’లో జాతీయ అవార్డు లభించింది. ఈ సందర్భంగా నిర్మాతగా ప్రియాంక చోప్రా తన ఆనందాన్ని ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు.