సల్మాన్ తో కాబట్టి 12 కోట్లతో సరిపెట్టుకుంది !

ప్రియాంకా చోప్రా లాంటి నటీమణులు బాలీవుడ్‌ని దాటి హాలీవుడ్‌వైపు కూడా అడుగులు వేస్తున్నారు. పారితోషికాన్ని కూడా అదే స్థాయిలో ఆశిస్తున్నారు. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ ‘భరత్‌’ చిత్రం కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.12కోట్లను తీసుకుంటున్నారట. ‘భరత్‌’ నిర్మాతలు ఆమెను సంప్రదించగానే ఆమె టీమ్‌ రూ.14కోట్ల పారితోషికాన్ని డిమాండ్‌ చేశారట. ‘పద్మావత్‌’లో నటించినందుకుగానూ దీపికకు రూ.12కోట్లే ఇచ్చారని, ప్రియాంకను కూడా అంతకు అంగీకరించమని నిర్మాతలు కోరారట. వారు నచ్చజెప్పిన విధానం బావుండటంతో ప్రియాంక తరఫు నుంచి రూ.12కోట్లకే గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని వినికిడి. సల్మాన్‌తో ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలను రూపొందించిన అలీ అబ్బాస్‌ జాఫర్‌ ‘భరత్‌’ను తెరకెక్కిస్తున్నారు. వారి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూడో చిత్రం 2019 రంజాన్‌కు విడుదల కానుంది. 2014లో విడుదలైన సౌత్‌ కొరియన్‌ చిత్రం ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌ ప్రై.లిమిటెడ్‌, టీ సీరీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అతుల్‌ అగ్నిహోత్రి, భూషణ్‌ కుమార్‌ నిర్మాతలు.
పారితోషికం డిమాండ్‌ చేయడం మాత్రమే కాదు, అదే స్థాయిలో మెయింటెనెన్స్‌ కూడా చేస్తున్నారు ప్రియాంక. ఇటీవల న్యూ జెర్సీలో గాయకుడు నిక్‌ జోనాస్‌తో కలిసి ఆమె వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు ఆమె తీసుకెళ్లిన బ్యాగ్‌ ఖరీదు రూ 4.6లక్షలట. ప్రముఖ ఇటాలియన్‌ బ్రాండ్‌ బొటేగా వెనెటాకు చెందిన ఈ బ్యాగు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది

ఎవరూ ఛాన్స్‌ ఇవ్వలేదట!
బాలీవుడ్‌లో కుర్రభామలు ఎక్కువైపోతున్నారు. దాంతో 30 పైబడిన వారందరూ హీరోయిన్‌ రేసులో వెనకపడిపోతున్నారు. ఈ కోవలోకి రాబోతోంది ప్రియాంకాచోప్రా కూడా! గత కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్‌ మీద దృష్టి పెట్టిన ప్రియాంకా గోడక్కొట్టిన బంతిలాగా తిరిగి బాలీవుడ్‌ వచ్చింది. అయితే ఆమె రాకకు ఎవరు పెద్దగా సంతోషపడినట్టులేదు. ఒక్క సల్మాన్‌ఖాన్‌ తప్ప ఎవరూ తమ సినిమాలో ప్రియాంకాకు ఛాన్స్‌ ఇవ్వలేదట! అందాల ప్రదర్శన ఎంతగా చేసినా ఫలితం లేకపోతోందని ప్రియాంకా తన సన్నిహితుల వద్ద వాపోతోందట! మొత్తానికి బాలీవుడ్‌లో ప్రియాంకా పని అయిపోయిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.