పీటి ఉష జీవిత కథలో ప్రియాంక చోప్రా

ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవితకథల ఆధారంగా సినిమాలను తెరకెక్కించేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి పీటీ ఉష జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. దక్షిణాది దర్శకురాలు రేవతి ఎస్ వర్మ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు.

తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు రూపొందించిన రేవతి, పీటీ ఉష జీవితకథను జాతీయ స్థాయి చిత్రంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను సంప్రదిస్తున్నారు. ఈ సినిమాలో పీటీ ఉష పాత్రలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నటించనున్నారట.

గతంలో రెజ్లర్ మేరీ కోమ్ పాత్రలో నటించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ప్రియాంక మరోసారి క్రీడా నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాలో సత్తాచాటనుంది. తన బయోపిక్ ను రూపొందించేందుకు పీటీ ఉషను ఒప్పించడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు రేవతి.