సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్ కు కోట్లు

ప్రియాంక చోప్రాని ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియ‌న్స్ మంది అనుస‌రిస్తున్నారంటే.. ప్రియాంక‌కి ఉన్న ఫాలోయింగ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ విలువ ఆమె పాపులారిటీకి త‌గ్గ‌ట్టే ఉంటుంద‌ట‌. ‘గ్లోబ‌ల్ బ్యూటీ’ ప్రియాంక చోప్రా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. పెళ్ళికి ముందు సినిమాలు.. ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని షేర్ చేసిన ప్రియాంక..నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకున్న త‌ర్వాత.. ఇద్ద‌రికి సంబంధించిన విష‌యాల‌ని త‌ర‌చుగా షేర్ చేస్తూ ఉంది. హోలీ వేడుక‌ లలో పాల్గొన్న ఫోటోల‌ని షేర్ చేసి ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగించింది. అయితే, ప్రియాంక చోప్రా పోస్ట్ విలువ ఆమె పాపులారిటీకి త‌గ్గ‌ట్టే ఉంటుంద‌ట‌. తాజాగా ‘హోపర్‌ హెచ్‌క్యూ’ సంస్థ సంచ‌ల‌న విష‌యాలు వెల్లడించింది. ప్రియాంక ఓ బ్రాండ్‌ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌మోట్ చేస్తే అక్ష‌రాలా 2 కోట్లు తీసుకుంటుంద‌ని వెల్ల‌డించింది. ఈ మొత్తం ‘కొంద‌రు హీరోల సినిమా రెమ్యున‌రేష‌న్‌ తో సమానం’ అనే విష‌యం తెలిసిందే. ఈ విధంగా త‌న‌ పాపులారిటీని ప్రియాంక చాలా చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు..
 
లక్ష్యం కోసం పయనించేవారికి ప్రేరణ
ప్రతిష్ఠాత్మక ‘మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌’ గెలుచుకున్న అరవింద్‌ అడిగ ‘ద వైట్‌ టైగర్‌’ నవలను ‘నెట్‌ఫ్సిక్స్‌’ చిత్రంగా మలుస్తోంది. రమిన్‌ భరణి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ‘గ్లోబ‌ల్ స్టార్‌’ ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్ర పోషించనుంది. ఆమెకు జతగా వర్ధమాన నటుడు రాజ్‌కుమార్‌ రావు నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆఖరులో భారత్‌లో షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ‘ద వైట్‌ టైగర్‌’ప్రాజెక్ట్‌లో పనిచేసేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అందులోని కథనం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ కథ ఓ లక్ష్యం కోసం పయనించేవారికి ప్రేరణ కలిగిస్తుంది” అని ప్రియాంక వెల్లడించింది.ప్రియాంకా చోప్రా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తోంది.
 
‘పల్లెటూరులోని ఓ టీ కొట్టు వర్కర్‌… ఆ స్థాయి నుంచి మహానగరంలో పారిశ్రామికవేత్తగా ఎదిగిన’ నేపథ్యమే ‘ద వైట్‌ టైగర్‌’. ఈ నవలను చిత్రంగా మలచాలన్న తన పదేళ్ల కల నేడు నిజం కాబోతుందని రమిన్‌ భరణి అన్నాడు. స్ర్కీన్‌ప్లే కూడా తనే సమకూర్చుతున్నాడు. ‘ఇంతటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులో చేసేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా’ అని రాజ్‌కుమార్‌ చెప్పాడు.ముకుల్‌ దేవ్‌రాతో కలిసి నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.