హాలీవుడ్ లోనూ సొంత సినిమా తీస్తుందట !

ఇప్పుడు స్వంత సినిమా ప్రొడక్షన్‌ను హాలీవుడ్‌లో కూడా మొదలుపెట్టేయాలని నిర్ణయించుకుందట బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆమె హాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడ ఫుల్ బిజీ అయిపోయింది. సీరియల్, సినిమాలు, యాడ్స్, టివి షోలు, మ్యాగజైన్‌ల కోసం ఫొటోషూట్స్‌తో అస్సలు గ్యాప్ లేకుండా దూసుకుపోతోంది ఈ అమ్మడు. ఇప్పుడు హాలీవుడ్‌లో కొత్త అవతారం ఎత్తబోతోందట ప్రియాంక. “క్వాంటికో” సిరీస్ 3వ సీజన్ షూటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ… “ఏ కిడ్ లైక్ జేక్” అనే హాలీవుడ్ మూవీ షూటింగ్ కూడా చేసేస్తోంది. ఆవెంటనే “ఈజింట్ ఇట్ రొమాంటిక్” మూవీలో కూడా నటించాల్సి ఉంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూనే… ఇప్పుడు సినిమా ప్రొడక్షన్‌ను హాలీవుడ్‌లో కూడా మొదలుపెట్టేయాలని నిర్ణయించుకుందట.

ఆమెకు “పర్పుల్ పెబుల్ పిక్చర్స్” అనే బ్యానర్ ఉంది. ఈ బ్యానర్‌పై ప్రియాంక నిర్మాతగా ఇండియాలో సినిమాలు తీయాలనుకుంది.వివిధ ప్రాంతీయ భాషల్లో డజన్ వరకూ సినిమాలు తీస్తోంది . ఇదే బ్యానర్‌ను ఇప్పుడు హాలీవుడ్‌కు కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా ఖరారు చేసింది. “పర్పుల్ పెబుల్ బ్యానర్‌పై మొదట బాలీవుడ్ సినిమానే తీయాలని ప్రియాంక గట్టి పట్టుదలతో ఉంది. అయితే ఈ ఏడాది చివరలో ఓ హాలీవుడ్ మూవీని కూడా ఆమె ప్రారంభించే అవకాశాలున్నాయి. టాలెంట్ ఉండి అవకాశం చిక్కని వారికి ఛాన్స్ ఇవ్వడమే ఈ బ్యానర్ ప్రధాన ఉద్దేశ్యం. అలాగే కొత్త కథలకు ఈ బ్యానర్ ప్రాధాన్యతనిస్తుంది. నిర్మాణంలో కూడా బిజీకావాలనుకుంటోంది ప్రియాంక”అని చెప్పింది మధు చోప్రా.