ఈ దక్షిణాది హీరో తో చెయ్యాలనుందట !

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న నటి ప్రియాంకా చోప్రా. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా చాలా ఎక్కువే. అయితే ఈ భామ ఓ సౌత్‌ హీరోకు పెద్ద అభిమానట. ఈ విషయాన్ని ప్రియాంక స్వయంగా ట్విటర్‌ ద్వారా తెలిపారు. తమిళ నటుడు విజయ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే చేస్తారా? అని ఓ అభిమాని ప్రియాంకను ప్రశ్నించారు.దీనికి ఆమె స్పందిస్తూ… ‘ఆయనతో కలిసి నటించేందుకు ఇష్టపడుతా. విజయ్‌కు నేను పెద్ద అభిమానిని.’ అని ట్వీట్‌ చేశారు. ప్రియాంక బాలీవుడ్‌కు పరిచయం కాకముందు విజయ్‌తో కలిసి ‘తమిళన్‌’ అనే చిత్రంలో నటించారు. ఆమె నటిగా ప్రేక్షకులకు పరిచయమైన తొలి సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాదు ఈ చిత్రంలోని ఓ పాటను ఆమె ఆలపించారు.

“న‌న్ను ‘హాలీవుడ్ న‌టి’ అని సంబోధించ‌డం బాగానే ఉంది. కానీ, న‌న్ను బాలీవుడ్ హీరోయిన్ అంటేనే ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తా. నాకు హిందీతోపాటు ద‌క్షిణాది సినిమాల్లోనూ న‌టించాల‌ని ఉంది. నాకు త‌మిళ టాప్  హీరో  విజ‌య్ అంటే చాలా ఇష్టం. అవ‌కాశం వ‌స్తే ఆయ‌న సినిమాలో హీరోయిన్‌గా న‌టించాల‌ని ఉంద‌”ని ప్రియాంక చెప్పింది.ఇటీవల విడుదలైన విజ‌య్ చిత్రం  ‘మెర్సల్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే .
హలీవుడ్‌కు వెళ్లాక ప్రియాంక‌ అందాల ప్ర‌ద‌ర్శ‌న శృతిమించుతోంద‌ని విమ‌ర్శ‌లు విన‌బ‌డుతున్నాయి. దీని గురించి తాజా ఇంట‌ర్వ్వూలో ప్రియాంక స్పందించింది. అలాగే బాలీవుడ్‌తోపాటు, ద‌క్షిణాది చిత్రాల్లోనూ న‌టించాల‌ని ఉంద‌ని చెప్పింది. తాను ఎప్ప‌టికీ భార‌తీయ న‌టినేన‌ని స్ప‌ష్టం చేసింది.
`అంద‌రూ నేను ఎక్స్‌పోజింగ్ విప‌రీతంగా చేస్తున్నాన‌ని విమ‌ర్శిస్తున్నారు. స్విమ్మింగ్‌పూల్‌లోనూ, బీచ్‌లోనూ చీర‌ల‌తో ఈత కొట్ట‌లేం క‌దా!. అయినా చాలా బాలీవుడ్ సినిమాల్లో నేను బికినీ ధ‌రించాను. హాలీవుడ్‌లో బికినీ అనేది కామ‌న్‌. ఆ మాత్రం దానికే ఎందుకు అంత‌గా విమ‌ర్శిస్తున్నారో నాకు అర్థం కావ‌డం లేదు. మ‌హిళ వ‌స్త్ర‌ధార‌ణ గురించి చీప్‌గా కామెంట్ చేయ‌డం మానేస్తే బెట‌ర్‌ !… అని అంది