ఇకపై అడ‌ల్ట్ సినిమాలు-షోల్లో న‌టించం !

పెళ్లి త‌ర్వాత కూడా హాట్ హాట్‌ సీన్ల‌లో న‌టించేందుకు సిద్ధ‌మేనంటూ ఇటీవ‌లి కాలంలో హీరోయిన్లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంటే.. అందుకు విరుద్ధంగా నిర్ణ‌యం తీసుకున్నారు ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్‌. వీరిద్ద‌రూ గ‌తేడాది పెళ్లి పీట‌లు ఎక్కిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు హాట్ హాట్ స‌న్నివేశాల్లో రెచ్చిపోయి న‌టించిన వీరిద్ద‌రూ ఇక‌పై అలాంటి సినిమాల్లో క‌నిపించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇక‌పై అడ‌ల్ట్ సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్ సిరీస్‌ల్లో న‌టించ‌బోమ‌ని తాజాగా ఓ హాలీవుడ్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్ జోనాస్ స్ప‌ష్టం చేశాడు.
“ఇంత‌కు ముందు నేను, ప్రియాంక అడ‌ల్ట్ థీమ్‌తో వ‌చ్చిన కొన్ని సినిమాలు, కార్య‌క్ర‌మాలు చేసి ఉండ‌వ‌చ్చు. ఇక‌పై అలాంటివి చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నాం. భ‌విష్య‌త్తు, కుటుంబం, పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. ఇక‌పై, అడ‌ల్ట్ కంటెంట్ ఉన్న ఏ కార్య‌క్ర‌మాన్ని, సినిమాను మేం అంగీక‌రించ‌బోమ‌”ని నిక్ తెలిపాడు.
 
పరిణీతి పాటకు ప్రియాంక ఫిదా !
ప్రియాంకా చోప్రా తన సోదరి, నటి పరిణీతి చోప్రా పాటకు ఫిదా అయ్యింది . ఈ ఇద్దరు సోదరీమణులు నటనతోనే కాకుండా తమ గాత్రంతోనూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘మేరీ ప్యారీ బిందూ’లోని ‘మాన్‌కే హమ్‌..’ పాటతో అందర్నీ మెప్పించిన ఆమె తాజాగా ‘కేసరి’లోని ‘తేరీ మిట్టి..’ గీతాన్ని (ఫిమేల్‌ వెర్షన్‌) పాడారు. పాట వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ పాటను విన్న ప్రియాంక ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘చాలా గర్వంగా ఉంది బేబీ. ఈ పాట నా హృదయాన్ని తాకింది’ అని పోస్ట్‌ చేశారు.
 
‘కేసరి’ సినిమాలో అక్షయ్‌ కుమార్‌, పరిణీతి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్లు రాబట్టింది. ప్రియాంక, పరిణీతి తమ వ్యక్తిగత విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య దాపరికాలు ఉండవని ఓ ఇంటర్వ్యూలో పరిణీతి తెలిపారు…. నిక్‌ జొనాస్‌ ప్రపోజ్‌ చేసిన విషయాన్ని ప్రియాంక అర్థ రాత్రి కాల్‌ చేసి చెప్పారని తెలిపారు. ‘ప్రియాంక పుట్టినరోజున నిక్‌ ప్రపోజ్‌ చేశారు. నాకు తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆమెకు హాలిడే అని నాకు తెలుసు.. అందుకే వీడియో కాల్‌ చేశా. ఆమె నాకు ఉంగరం చూపించింది. నాకు మతిపోయింది. ప్రియాంకతోపాటు నిక్‌ కూడా ఉన్నారు. తమ ప్రేమ విషయం చెప్పగానే.. నా ఏడుపు మొదలు పెట్టా. అది భావోద్వేగంతో కూడిన అందమైన రోజు’ అని పరిణీతి చెప్పింది.