మరోసారి ఆదాయంలో ఆదరగొట్టేసింది !

బాలీవుడ్‌లో బిజీగాఉన్న సమయంలో హాలీవుడ్‌లో అవకాశాలందుకుని పాపులర్ అయిన నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్‌లో ‘క్వాంటికో’ అనే టెలివిజన్ షో ఆమెకు చాలా పాపులారిటీ తెచ్చిపెట్టింది. తొలి సీజన్లోనే మంచి పేరు గడించిన ప్రియాంక.. రెండు, మూడు సీజన్లలో కంటిన్యూ అవుతూ అదరగొట్టేస్తోంది. టీవీ సిరీస్‌లో నటించినందుకు ప్రియాంకకు ‘అమెరికా పీపుల్స్ ఛాయిస్’ అవార్డు కూడా దక్కింది. ఇక పారితోషికం విషయానికి వస్తే మిలియన్ డాలర్లు తీసుకున్నట్టు సమాచారం. గత ఏడాది ఆమె 10.5 మిలియన్ డాలర్ల దాకా పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే రూపాయల్లో చెప్పాలంటే 70 కోట్లు.
 ఒక బాలీవుడ్ హీరోయిన్ ఒక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తం సంపాదించటం మామూలు విషయం కాదు. ‘ఫోర్బ్స్’ మేగ‌జైన్ విడుద‌ల చేసిన జాబితాలో ఈ సారి కూడా ఎనిమిదో స్థానంలో నిలిచింది. 1, జూన్ 2016 నుంచి 1, జూన్, 2017 మ‌ధ్య కాలంలో టీవీ కార్యక్రమాల ద్వారా ప్రియాంక 10 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించిన‌ట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇందులో 50 శాతానికి పైగా ఆదాయం.. ప్రకటనల ద్వారానే పొందినట్టు తెలిపింది. ఈ జాబితాలో ఈసారి కూడా కొలంబియా న‌టి సోఫియా వెర్గారా 41.5 మిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌తో మొద‌టి స్థానంలో నిలిచింది. గ‌త ఆరేళ్ల నుంచి సోఫియా వెర్గారా మొద‌టి స్థానంలో ఉంది