పృథ్వి ‘మై డియర్ మార్తాండం’ 29 న

పృథ్వి, రాకేందు మౌళి, కల్పిక, కళ్యాణ్ విటపు, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్, లు నటిస్తూ హరీష్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మై డియర్ మార్తాండం’ మూవీ ఈ రోజు హైదరాబాద్ లో ప్రేక్షకులతో ముచ్చటించారు.
ముఖ్య అతిదిగా పాల్గొన్న వెన్నెలకంటి గారు సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతూ… ఈ సినిమాలో మా అబ్బాయి రాకేందు మౌళి తెలుగులో హీరోగా పరిచయం అవుతుండటం చాలా హ్యాపీ గా ఉంది. సినిమా దర్శకుడు హరీష్ నాకు ఏప్పటి నుండో తెలుసు. తపన ఉన్న వ్యక్తి. సినిమా బాగా తీశాడు అని నమ్ముతున్నాను. ఈ డిసెంబర్ 29 న విడుదలకు సిద్దమయిన ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.
పృథ్వి  మాట్లాడుతూ… దర్శకుడు హరీష్ ఓపిక సినిమా పట్ల తనకు ఉన్న ప్రేమ కోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒక్కడే ఒక సైన్యంలా ఈ సినిమా కోసం పని చేశాడు. మిగతా నటినటులు అందరూ పూర్తిగా సహకరించారు. ఆర్టిస్ట్ లు సినిమా పబ్లిసిటీ కి కూడా రావాలి. అప్పుడే సినిమాకు నిండుతనం వస్తుంది అని తెలిపారు.
హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ… నేను తెలుగులో కొన్ని సినిమాలు ఆర్టిస్ట్ గా చేశాను, హీరోగా ఇది నా తొలి సినిమా. తోలి సినిమానే ఇంత మంచి నటులతో చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ 29 న వస్తున్నాం. మీ అందరికి బాగా నచ్చుతుంది. అని తెలిపారు.
కళ్యాణ్ మాట్లాడుతూ… నాకు హరీష్ అన్న వలన ఈ సినిమాలో మంచి రోల్ వచ్చింది, మా సినిమా ఈ 29 న విడుదల అవుతుంది, మీ అందరికి నచ్చుతుంది. మిగితా ఆర్టిస్ట్ లు అందరూ బాగా సహకరించారు అని తెలిపారు.
దర్శకుడు హరీష్ మాట్లాడుతూ… మాకు పెద్ద దిక్కు పృథ్వి గారు, ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను అంటే అది ఆయన వలెనే. సినిమా కోర్ట్ డ్రామా తో పాటు మంచి కామెడీ గా ఉంటుంది. చాలా కొత్త పాయింట్. ముందు ఒక చిన్న సినిమా గా మొదలు పెట్టాను, ఇప్పుడు ఇది పెద్ద సినిమా అయింది అంటే నటీనటుల సహకారమే అని తెలిపారు. మా సినిమా 29 కూ వస్తుంది. మీ అందరికి నచ్చుతుంది అని పూర్తిగా నమ్ముతున్నాను.
హీరోయిన్ కల్పిక మాట్లాడుతూ…నేను పృథ్వి గారి మేనకోడలు గా చేశా ఈ సినిమాలో, నా పాత్రా చాలా బాగుంటుంది. దర్శకుడు హరీష్ ఈ సినిమాను చాలా ప్రేమించారు. ఇది చిన్న సినిమాక్ కాదు, మంచి సినిమా. అందరికి నచ్చుతుంది అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ గోకుల్, దర్శకుడు హరీష్, పంపిణీ దారుడు సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.