అన్నీఉన్న కమ‌ర్షియల్ మూవీ ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’

హరిహర చలన చిత్ర బ్యానర్‌పై నందు, సౌమ్య వేణుగోపాల్, పూజా రామచంద్రన్, గగన్ విహారి తారాగణంగా రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ ఏప్రిల్ 6న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంంలో పూజా రామ‌చంద్రన్ మాట్లాడుతూ ‘‘సినిమాలో తార అనే క్యారెక్టర్ చేశాను. డిఫరెంట్ షేడ్స్ పాత్ర నాది. హాట్, సెక్సీ, ఎమోషనల్ ఇలా అన్ని కోణాలున్న క్యారెక్టర్‌లో నటించాను. ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ సినిమా విషయానికి వస్తే.. హీరో, హీరోయిన్ పెళ్లికి 36 గంటల ముందు ఏం జరిగిందనేదే కథ. నందు, త్రిశూల్, నరసింహ, కృష్ణతేజలతో కలిసి ఈ సినిమా షూటింగ్ టైంను బాగా ఎంజాయ్ చేశాను.

నేను మలయాళీ అమ్మాయిని. నాన్న ఆర్మీ ఆఫీసర్ కావడంతో చాలా ప్రదేశాలు చూసే అవకాశం కలిగింది. ఇక హీరోయిన్‌గా మారిన తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నాను. సీరియస్ రోల్స్‌ను బాగా ఇష్టపడతాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే అన్ని ఎలిమెంట్స్ ఉన్న కమ‌ర్షియల్ మూవీ ఇది. తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అవకాశం వస్తే తప్పకుండా తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమే. డైరెక్టర్ వరప్రసాద్‌గారికి వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ వద్ద పనిచేసిన అనుభవం ఉంది. మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్. నటీనటుల నుండి కావాల్సిన పెర్ఫావెున్స్‌ను రాబట్టుకున్నారు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాను. పెర్ఫావెున్స్‌కు స్కోప్ ఉండే పాత్రలో నటించడానికి సిద్ధం. నెగిటివ్ క్యారెక్టర్ అయినా సరే! అలాగే యాక్షన్ మూవీస్‌లో నటించాలనే డ్రీమ్ ఉంది’’ అన్నారు.