అతనికి చెప్పనిదే ఏదీ చేయడం లేదట !

‘మిస్ యూనివర్స్’ సెకండ్ రన్నరప్ కిరీటాన్ని దక్కించుకున్న పూజ హెగ్డే మొదట ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్‌గా ఎదిగి… ఆతర్వాత పలు ప్రముఖ కంపెనీ యాడ్స్‌లో మెరిసింది. ఆమె  మొదటి సినిమా కోలీవుడ్‌లో మొదటి సినిమా చేసి వెండితెరకు పరిచయమై పర్వాలేదనిపించుకుంది. ‘ముకుందా’ చిత్రంతో టాలీవుడ్‌లోకి వచ్చి ఇక్కడి ఫిల్మ్‌మేకర్స్ దృష్టిలో పడింది. అనంతరం అదృష్టవశాత్తు బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన‘మొహంజోదారో’ సినిమాలో నటించే లక్కీ ఆఫర్‌ను దక్కించుకుంది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పూజాహెగ్డే తీవ్ర నిరాశచెందింది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే హృతిక్‌కు ఆమె చాలా దగ్గరైందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. హృతిక్ ప్రస్తుతం పూజకి గురువుగా మారాడని అంటున్నారు.

ఇటీవల పూజాహెగ్డే నటించిన హిట్ మూవీ ‘డీజే… దువ్వాడ జగన్నాథం’ తర్వాత ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే బాలీవుడ్‌లో ఆమెకు ఛాన్సులు మాత్రం రావడం లేదు. దీంతో హృతిక్ రోషన్ బాలీవుడ్‌లో ఓ రెండు ఆఫర్లు పూజకు దక్కేవిధంగా రికమండ్ చేస్తున్నాడట. దీంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్‌షిప్ ఉందంటూ గాసిప్స్ వినబడుతున్నాయి. కొంతకాలం క్రితం హృతిక్ తన భార్య సుసానేకు విడాకులు ఇచ్చినప్పటి నుండి పూజాహెగ్డేతో సన్నిహితంగా ఉంటున్నాడనే కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే ఏదో స్నేహభావం తోనే హృతిక్… పూజకు సహకరిస్తూ అవకాశాలు దక్కేవిధంగా చూస్తున్నాడని బాలీవుడ్‌లో కొందరు పెద్దలు అంటున్నారు. పూజ ఏ విషయాన్ని అయినా హృతిక్‌కు చెప్పనిదే చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది.