మా సినిమాను మీడియా అతి దారుణంగా చంపేసింది !

ద‌క్షిణాదిన ఆశించినంత గుర్తింపు రాక‌పోవ‌డంతో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది రాయ్ ల‌క్ష్మి. `జూలీ-2` వంటి ఎరోటిక్ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుని సెక్స్ బాంబ్‌గా బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుదామ‌నుకుంది. అయితే ఇటీవ‌ల విడుద‌లైన ఆ సినిమా రాయ్ ల‌క్ష్మి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. విమ‌ర్శ‌కులు దారుణంగా రేటింగ్‌లు ఇవ్వ‌డంతో ప్రేక్ష‌కులెవ‌రూ ఆ సినిమాను, రాయ్ ల‌క్ష్మిని కనీస స్థాయిలో కూడా ప‌ట్టించుకోలేదు. దీంతో రాయ్‌ల‌క్ష్మి మీడియాపై నిప్పులు చెరిగింది….
`మా సినిమాను మీడియా అతి దారుణంగా చంపేసింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాకు ఘోర‌మైన రివ్వూలు రాసి తొక్కేసింది. సినీ ప‌రిశ్ర‌మ‌లోని చీక‌టి కోణాన్ని చూపించినందువ‌ల్లే ఈ ప‌రిస్థితి ఎదురైంది. మా సినిమా నిర్మాత కూడా ప‌బ్లిసిటీ మీద పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. వ్యూహాత్మకంగా ప్ర‌చారం నిర్వ‌హించి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌`ని రాయ్‌ల‌క్ష్మి ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

 

అప్పుడే ఈ రంగంలోని చీకటి కోణాలు తెలిశాయి !

చిన్నతనం నుంచీ నన్ను నేను తెరమీద చూసుకోవాలన్న కోరిక బలంగా ఉండేది. ఆ కోరికతోనే సినీ రంగంలోకి అడుగుపెట్టాను. నేను సినీ నేపథ్యం నుంచి వచ్చినదాన్ని కాదు. నా వెనుక ఎవరి సపోర్టూ లేదు. దాంతో సినీ రంగంలోకి రావడానికి చాలా కష్టమే పడ్డాను. నాకు మొదటి అవకాశం వచ్చింది కోలీవుడ్‌లోనే. ఆ సినిమా తరువాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్నాను. అప్పుడే ఈ రంగంలోని చీకటి కోణాలు తెలిశాయి. లైంగిక వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయనేది కూడా నాకు అప్పుడే అర్థమైంది. కానీ నేనెవరికీ లొంగకూడదని అనుకున్నాను. పరిస్థితులతో సర్దుకుపోవాలని చాలామంది నాకు నచ్చచెప్పారు. అయినా నేను ఎవరి మాటా వినలేదు. అలా విని ఉంటే ఈ పాటికి నేను స్టార్‌ హీరోయిన్‌ అయ్యేదాన్ని. ఈ రంగంలో ఇంతకాలంనుంచి ఉన్నా ఎందుకు సక్సెస్‌ కాలేకపోయానో చెప్పడానికే ఈ విషయాలు చెబుతున్నాను కానీ, ఎవరినీ కించపరచడానికి కానీ, అవమానించడానికి కానీ కాదు. ఇవి నాకు ఎదురైన అనుభవాలు మాత్రమే. అందరికీ అలా జరగాలని లేదు. ఈరంగంలో స్వశక్తితో స్టార్‌ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నవారు చాలామందే ఉన్నారు.

దక్షిణాదిన నా సినిమాలు చూసి నాకు ‘జూలీ 2’లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు కొత్త ఫేస్‌ అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు అనుకున్నారట! అవకాశం రాగానే సంతోషం అనిపించినా, వెంటనే ఓకే చెప్పలేకపోయాను. దాదాపు నెల రోజులపాటు ఆలోచించాను. ఈ సినిమా కోసం మునుపెన్నడూ పడనంత కష్టం పడ్డాను.ఆ కష్టాన్ని దృష్టిలో పెట్టుకునే పారితోషికం అడిగాను. ఇక్కడ ఇంకో విషయం స్పష్టం చేయాలి. ఇదే సినిమా దక్షిణాదిలో చేయవలసి వస్తే బహుశా చేయనేమో! ఇక్కడి పరిస్థితులు, వాతావరణం అలాంటివి.