సంక్షోభ స‌మ‌యంలో సాయం చేస్తేనే ‘సెల‌బ్రిటీ’ !

రాశీఖ‌న్నా ఇటీవ‌లే ‘థాంక్యూ’ సినిమా కోసం విదేశాల్లో వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్క‌డ‌కు రాగానే కరోన బాధితులకు సేవా కార్య‌క్ర‌మాలు ప్రారంభించింది. కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలో ముందుకొచ్చి సాయం చేసినపుడే సెల‌బ్రిటీ స్టేట‌స్ కు స‌రైన అర్థం ఉంటుంద‌ని చెప్పింది. ఎవ‌రైనా అత‌డు కానీ, ఆమె కానీ ‘సెల‌బ్రిటీ’ అని పిల‌వ‌బ‌డితే, అది త‌న చుట్టూ ఉన్న వారికి సాయం చేసిన‌పుడే. కొంద‌రు సెల‌బ్రిటీలు చేస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయం.

ఇప్పుడు అంద‌రికీ చేరువ కావ‌డానికి సోష‌ల్ మీడియా చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మంచి అభిమానులున్న సెల‌బ్రిటీలు చాలా మందికి రోల్‌ మోడ‌ల్స్ గా నిలుస్తున్నారని చెప్పింది. ఇంకా చాలా మంది సెల‌బ్రిటీలు ముందుకొచ్చి త‌మ‌వంతు సాయం చేయాల‌ని కోరింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక్క వ్య‌క్తి ఏం చేయ‌లేరు. అంద‌రం క‌లిసి సాయం చేయాల్సిన స‌మ‌యం. ఎన్జీవోస్ సాయంతో నా వంతుగా హెల్ప్ చేస్తున్నా. ఆక‌లిని తీర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని చెప్పింది రాశీఖ‌న్నా .ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రాశీ ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేసే చాన్స్‌ దక్కించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’, ‘ఆరన్‌మనై3’, ‘తుగ్లక్‌ దర్బార్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘థ్యాంక్యూ యు’, ‘సర్దార్‌’, ‘సైతాన్‌ కా బచ్చా’, ‘భ్రమం’, ‘తుగ్లక్ దర్బార్’,’మేధావి’… వంటి  తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాలతో బిజీగా ఉంది రాశీఖన్నా.

వెబ్ సిరీస్‌లో సైకో హంతకురాలిగా…  వినూత్న కథాంశాల్ని ఎంచుకొని పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి కథానాయికలకు వెబ్‌ సినిమాలు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. సమంత, తమన్నా వంటి అగ్ర నాయికలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మీద సత్తాచాటడంతో మరికొంత మంది తారలు వారి మార్గాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా పంజాబీ సుందరి రాశీఖన్నా డిజిటల్‌ వేదికపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ఆమె ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తోంది.‘రుద్ర’ సిరీస్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ‘వెంటిలేటర్‌’ ఫేమ్‌ ఎమ్‌. రాజేష్‌ ‘రుద్ర’ సిరీస్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌’ ఫేమ్‌ రాజ్‌ అండ్‌ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్నఈ వెబ్‌ సిరీస్‌లో షాహిద్‌ కపూర్, విజయ్‌ సేతుపతి కూడా చేస్తున్నారు. క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.ఇంగ్లిష్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ డ్రామా ‘లూథర్‌’ ఆధారంగా ఈ హిందీ వెబ్‌ సిరీస్‌ రూపొందనుంది. ‘లూథర్‌’ సిరీస్‌లో రూథ్‌  విల్సన్‌ పోషించిన పాత్రలో రాశీ చేస్తుందట. ఇందులో రాశీఖన్నా సైకో హంతకురాలిగా కనిపించనుందట. విపరీత మనస్తత్వం కలిగిన యువతిగా ఆమె పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని చెబుతున్నారు. రాశీఖన్నా నటిస్తున్న రెండో వెబ్‌సిరీస్‌ ఇది. ఈ సిరీస్‌ ఓటీటీ వేదికపై తనకు మంచి గుర్తింపును తీసుకొస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది రాశీఖన్నా.