ప్రాంతీయ చిత్రాలు బాలీవుడ్‌ ను మించి పోతాయి !

‘ ‘బాహుబలి’ చిత్రం ప్రాంతీయ సినిమాలపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేసింది. అలాగే గతేడాది వచ్చిన ‘కబాలి’ రికార్డులను బ్రేక్‌ చేసింది. మరాఠీ చిత్రాలు కూడా బాగానే ఆడాయి. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ ప్రాంతీయ చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి. ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ చిత్రాలపై అందరి చూపు ఉంటుంది. స్క్రిప్టు బావుంటే బాలీవుడ్‌ నిర్మాతలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. బాలీవుడ్‌ నటులు కూడా ఆ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో ప్రాంతీయ సినిమాలను వివిధ భాషల్లో రిలీజ్‌ చేస్తూ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. ఈ రోజుల్లో డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంలు అందుబాటులోకి రావడంతో ప్రాంతీయ సినిమాలకు హద్దులు చెరిగిపోతున్నాయి. అక్కడ అన్ని భాషల సినిమాలు దొరుకుతున్నాయి. అలాగే ప్రాంతీయ సినిమాలను హిందీ చిత్రసీమ ఆదరిస్తోంది. కాబట్టి భవిష్యత్తులో ప్రాంతీయ సినిమాలు హిందీ చిత్రసీమకు సమానంగా రాణిస్తాయి” అని రాధికా ఆప్టే అన్నది. 

ఆమె మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసింది…. “సినిమా రంగానికి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేని కానీ ప్రాంతీయ చిత్రాలు బాలీవుడ్‌ చిత్రాలను మించి దూసుకుపోతాయని మాత్రం గట్టిగా చెప్పగల”నని పేర్కొంది. “ప్రస్తుతం ఉన్న హవా భవిష్యత్తులో మరింత ఎక్కువ అవుతుందని తాను విశ్వసిస్తు”న్నట్టు చెప్పింది .