దక్షిణాదిలో సాంప్రదాయికం.. ఉత్తరాదిన రెచ్చి పోవడం !

సినిమాల్లో అందాల ఆరబోతతో సంతృప్తి చెందని రాధికా ఆప్టే తన అందాలు ఆరబోసిన ఫోటోలను  సోషల్ మీడియాలో ప్రదర్శిస్తోంది. పైగా ‘నా అందం నా ఇష్టం’ అంటోంది.  దాంతో నెటిజన్స్ అమ్మడి అందంపైనా, ఆమె ప్రవర్తనపైనా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. “నా అందం నా ఇష్టం. ఎలాగైనా ప్రదర్శించుకుంటాను. మీకేంటి?” అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది  రాధిక. ఈ భామ తెలుగునాట సంప్రదాయకం గా నటించి, ఇప్పుడు మరీ బోల్డ్ గా మారింది.
రాధికా ఆప్టే పేరు వినగానే తెలుగువారికి ముందుగా బాలకృష్ణతో ఆమె నటించిన ‘లెజెండ్, లయన్’ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ తరువాత రజనీకాంత్ సరసన అమ్మడు నటించిన ‘కబాలి’ కూడా గుర్తుకు వస్తుంది. దక్షిణాది చిత్రాల్లో పద్ధతిగానే నటించిన రాధికా ఆప్టే, ఆ తరువాత ఉత్తరాదికి పోయి టాలీవుడ్‌పై కామెంట్స్ చేయడం విడ్డూరంగానే అనిపించింది. అయితే ఆ తరువాతే అమ్మడు అందాల ఆరబోతలో మరీ దూకుడు ప్రదర్శించడం చూసి సినిమా జనం ముక్కున వేలేసుకున్నారు.
మన దక్షిణాది చిత్రాల్లో నటించినప్పుడు పద్ధతిగానే ఉన్న రాధికా ఆప్టే ఇప్పుడు మరీ బరితెగించడానికి కారణమేంటి? ఇదే ప్రశ్న మన సినీజనం మదిలో ఉంది. అయితే రాధికా ఆప్టే మొదటి నుంచీ బోల్డ్ కానీ, మన సినిమాల్లో ఆమెను సంప్రదాయకం గా చూపించడంతోనే మన సినిమా రంగంపై రాధికకు పట్టరాని కోపం వచ్చిందేమో? అంటున్నారు కొందరు. మరీ బోల్డ్ టైప్ అయిన రాధికా ఆప్టేను అంత సంప్రదాయకం గా చూపించడం తప్పే కదా? అంటున్నారు వారు. అలాంటి వారి కామెంట్స్‌‌తో మరింత చెలరేగిపోయింది రాధికా ఆప్టే. ఆ మధ్య తన చిత్రాల్లో బోల్డ్ నెస్ పెంచేసి సంచలనం సృష్టించింది.అందాల ఆరబోత హద్దుల్లో ఉంటే ముద్దుగా ఉంటుంది. లేకుంటే రోతగానే ఉంటుందని నెటిజన్స్ అంటున్నారు.