ఎగ్జైట్‌మెంట్ కలిగిస్తే ఏదైనా చేస్తాను !

రాధికా ఆప్టే… మోడరన్ ఇండియన్ సినిమాకి అందమైన నిదర్శనం… టాలెంటెడ్ బ్యూటీ. యూట్యూబ్‌లో దుమారం రేపే షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలు పెట్టి బిగ్ బ్యాడ్ బాలీవుడ్‌లో తనదైన స్థానం సంపాదించటం మామూలు విషయం కాదు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా.. రెగ్యులర్ హీరోయిన్స్‌ను ఢీకొట్టటం చాలా కష్టం. అయినా రాధికా హైవేను కాదని బైపాస్ రూట్లో సక్సెస్ కొట్టేసింది. కమర్షియల్ సినిమాలు, గ్లామరస్ పాటలు, హీరో ముందు బికినీ షోలు.. ఇవన్నీ చేయకుండా విభిన్న  సినిమాలతో సంచలనం రేపింది. అత్యంత సాదాసీదా పాత్రలతో మొదలు పెట్టి.. ఇప్పుడు సరికొత్తగా వచ్చిన ఇంటర్నెట్ వేదికలపైన కూడా రాధిక హల్ చల్ చేస్తోంది. ఆమె వరుసగా చేస్తోన్న ‘నెట్ ప్లిక్స్’ వెబ్ సిరీస్‌లు సంచలనంగా మారాయి. ఎలాంటి సెన్సార్ఇబ్బంది లేని ఈ కొత్త వినోదంలో.. రాధిక  విజృంభిస్తోంది. బాలీవుడ్ సినిమాల్లోనే ఆమె పూర్తి నగ్నంగా నటించేసింది… కాబట్టి ఇక ‘నెట్ ఫ్లిక్స్’ లాంటి అంతర్జాలచిత్రాల్లో తన ప్రతిభనంతా ప్రదర్శిస్తోంది.
రొటీన్‌కి భిన్నంగా ఉండేది ఏదైనా.. తన వద్దకు వస్తే రాధికా ఆప్టే ఎంతో ఆనందంగా చేసేస్తుంది! అందుకే ఇక్కడ బాలకృష్ణ, రజనీకాంత్ లాంటి టాప్ హీరోస్‌తో నటించినా కూడా.. మళ్లీ కమర్షియల్ సౌత్ సినిమాల జోలికి రాలేదు. కేవలం ఆడిపాడి రెమ్యూనరేషన్ తీసుకునే వర్క్ అంటే… ఈ మరాఠీ సుందరికి ఆసక్తి తక్కువ. అందుకే.. అటు బాలీవుడ్‌లో కూడా ఏ హీరొయిన్తోనూ పోటీ పడకుండా తనవైన ప్రాజెక్ట్స్‌ చేస్తోంది. టీవీ, కంప్యూటర్, థియేటర్ అన్న తేడా లేకుండా తనకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ అవకాశాలు, అవార్డులు రాబట్టుకుంటోంది. తనకు “ఎగ్జైట్‌మెంట్ కలిగిస్తే ఏదైనా చేస్తాను. ఎగ్జైట్మెంట్ లేకుంటే ఎలాంటిదైనా చేయను” అని కరాఖండిగా చెబుతోంది.
ఇప్పటికీ ఎగ్జైటింగ్‌ రోల్స్‌, స్క్రిప్ట్‌లు…
‘బడ్జెట్‌ పరంగా చిన్నా, పెద్ద సినిమా అనే తేడా చూడను. మంచి పాత్రల్లో నటించాలనుకుంటాను’ అని అంటోంది రాధికా ఆప్టే. మొదట్నుంచి బాలీవుడ్‌లో నవ్యమైన కథాంశాలు కలిగిన సినిమాలు చేస్తూ వస్తోంది రాధికా. సమాంతర సినిమాలకు కేరాఫ్‌గానూ నిలుస్తుంది.
“చిన్న బడ్జెట్‌ చిత్రమనే విషయాన్ని నేను పట్టించుకోను. బడ్జెట్‌ కంటే కథకే ప్రాధాన్యతనిస్తా. మంచి సినిమాల్లో భాగమవ్వాలన్నదే నా లక్ష్యం. ఓ నటిగా నేను విభిన్నమైన పాత్రలు పోషించాలి. పెద్ద సినిమాకైనా, చిన్న సినిమాకైనా నటన పరంగా ఒకే ఎఫర్ట్‌ పెడతాం. రెండింటికీ ఒకేలా కష్టపడతాం. కాబట్టి బడ్జెట్‌ని పట్టించుకోను. అదే సమయంలో పాత్ర నిడివికి కూడా ప్రాధాన్యతనివ్వను. జనరల్‌గా నాకు క్రియేటివ్‌ ప్రాసెస్‌లో ఇన్‌వాల్వ్‌ అవడం ఇష్టం. కెరీర్‌ ప్రారంభించి ఇన్నేండ్లు అవుతున్నా… ఇప్పటికీ ఎగ్జైటింగ్‌ రోల్స్‌, స్క్రిప్ట్‌లు వస్తున్నాయి. అందుకు చాలా హ్యాపీగా ఉంది. తాము అనుకున్నది చేయడానికి, కెరీర్‌ పరంగా ముందుకు సాగడానికి పెళ్ళి అడ్డుకాదనేది నా అభిప్రాయం’ అని తెలిపింది.
ప్రస్తుతం ఆమె ‘ది ఆశ్రమ్‌’, ‘చితిరమ్‌ పేసుతడి 2’, ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతోపాటు మరో రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో నటించబోతుంది. ‘మసాన్‌’, ‘న్యూటన్‌’ వంటి చిత్రాలని నిర్మించిన షిలాదిత్య బోరా దర్శకురాలిగా మారి తెరకెక్కించబోతున్న సినిమాలో కథానాయికగా ఎంపికైంది.