ఫీమేల్‌ సూపర్‌స్టార్స్‌గా అంగీకరించలేకపోతున్నారు !

‘హీరోయిన్లలో కూడా సూపర్‌స్టార్స్‌ ఉన్నారు. కానీ కొంతమంది వారిని సూపర్‌స్టార్లుగా అంగీకరించలేకపోతున్నారు’ అని అంటోంది రాధికా అప్టే. బాలీవుడ్‌తోపాటు చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య అసమానతల విషయంలో ఇటీవల బాగా చర్చ జరుగుతోంది. హీరోయిన్ల రెమ్యూనరేషన్‌తోపాటు సూపర్‌ స్టార్‌ హోదాపై రాధికా ఆప్టే మాట్లాడుతూ…’చిత్ర పరిశ్రమలో హీరో,హీరోయిన్ల విషయంలో చాలా అసమానతలున్నాయి. ప్రస్తుతం ఉన్న నటీనటులందరూ నాకు స్నేహితులే. అందులో హీరోలు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది నాకంటే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకునే వాళ్ళున్నారు. ఈ సమస్య ఒక్క చిత్ర పరిశ్రమలోనే కాదు సమాజంలో కూడా ఉంది.

బాలీవుడ్‌లో చాలా మంది మేల్‌ సూపర్‌ స్టార్స్‌ ఉన్నారు. మహిళా యాక్టర్స్‌లో కొంత మంది మాత్రమే ఆ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె వంటి వారు పెద్ద హీరోల చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో వీళ్ళని ఫీమేల్‌ సూపర్‌స్టార్స్‌గా చెప్పుకోడాన్ని కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. హీరోయిన్లను ప్రేక్షకులు సూపర్‌స్టార్లుగా అంగీకరిస్తే ఇండిస్టీలో హీరో, హీరోయిన్ల మధ్య అసమానతల విషయంలో చాలా మార్పు వస్తుంది.
మహిళా సూపర్‌స్టార్స్‌ అని గొప్పగా చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను’ అని తెలిపింది.

రాధికా ప్రస్తుతం ‘ఉలా’, ‘ది ఫీల్డ్‌’, ‘బాంబేరియా’, ‘ఆశ్రమ్‌’, ‘ప్యాడ్‌మ్యాన్‌’తోపాటు
‘భవేష్‌ జోషి చిత్రంలో నటిస్తోంది.