చిన్మ‌యి విడుద‌ల చేసిన ‘దృష్టి’ టీజర్

‘అందాల రాక్ష‌సి’, ‘అలా ఎలా’ సినిమాల‌తో ప్రేక్ష‌కుల మన‌సు గెలుచుకున్న రాహుల్ ర‌వీంద్ర‌న్ క‌థానాయకుడిగా, ఎమ్ స్వేర్ బ్యాన‌ర్ పై రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘దృష్టి’. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను ప్ర‌ముఖ గాయ‌ని చిన్మ‌యి విడుద‌ల చేశారు.
ఈ సంద‌ర్భంగా, చిన్మ‌యి మాట్లాడుతూ….  ఇలా సినిమాల గురించి, టీజ‌ర్ రిలీజ్ చేసి వాటి గురించి మాట్లాడ‌టం నాకు రాదు. నాకు పాట‌లు పాడ‌ట‌మొక్క‌టే వ‌చ్చు. కానీ ఈ సినిమాకు ప‌ని చేసిన వారి గురించి త‌ప్ప‌క మాట్లాడాలి.  డైర‌క్ట‌ర్  రామ్ గారి ప‌నిత‌నానికి నేను పెద్ద అభిమానిని. ఈ సినిమా యూనిట్ కు ఉన్నంత టైమ్ సెన్స్ నేనెక్క‌డా చూడ్లేదు. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చాల‌ని, సినిమా యూనిట్ కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు.
వెన్నెల కిషోర్ మాట్లాడుతూ…. టీజ‌ర్ లో న‌న్ను కూడా పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. ఈ సినిమా షూటింగ్ ను చాలా ఎంజాయ్ చేశాను. అస‌లు వాడ‌కం అంటే ఏంటో డైర‌క్టర్ రామ్ ను చూసే నేర్చుకోవాలి. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ ను డ‌బ్బింగ్ చెప్తున్న‌ప్పుడు చూసి నేనే షాక‌య్యాను ఇంత చేశానా అని. ఈ పాత్రను చాలా ఇష్ట‌ప‌డి చేశా. రాహుల్ తో ప‌నిచేయ‌డం అంటే నా  కుటుంబంతో క‌లిసి చేసిన‌ట్లే. ఈ సినిమాలో నేను కూడా భాగ‌స్వామినయింద‌కు సంతోషిస్తున్నా అన్నారు.
డైర‌క్ట‌ర్ రామ్ అబ్బిరాజు మాట్లాడుతూ…. చిన్మ‌యి గారు టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం మాకు చాలా సంతోషాన్నిచ్చింది. మాకు లేడీ లెగ్ బాగా క‌లిసొస్తున్నాయి. ఫ‌స్ట్ లుక్ స‌మంత గారు రిలీజ్ చేయ‌డం, ఇప్పుడు టీజ‌ర్ మీరు రిలీజ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క‌థ‌లు ఒప్పుకోవ‌డానికి మామూలుగా హీరోలు గ‌ట్స్ కావాలి. రాహుల్ ఆ ప్రయోగం చేశాడు. ఈ విష‌యంలో రాహుల్ కు థ్యాంక్స్ చెప్పాలి. సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు చెప్పారు.
హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ మాట్లాడుతూ…. నేనెప్ప‌టి నుంచో కొత్త‌గా సినిమాలు తీయాల‌నుకుంటున్న టైమ్ లో రామ్ నాకు ఈ క‌థ చెప్పాడు. క‌థ చెప్పిన వెంట‌నే న‌చ్చి ఓకే అనేశాను. మేం ఏ జాన‌ర్ సినిమా అని అయితే చెప్పామో సినిమా అచ్చం అలాగే ఉంటుంది. నేను ప‌నిచేసిన సినిమాల్లో ఈ సినిమాకు ఉన్న బెస్ట్ యూనిట్ ఎక్క‌డా చూడ‌లేదు. హీరోయిన్ పావ‌ని గురించి చెప్పాలి. తన‌కు ఆల్రెడీ పెళ్లి అయింది అని తెలిసి కూడా ఆమె ను సెలెక్ట్ చేసుకున్నందుకు ముందుగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను అభినందించాలి. వెన్నెల కిషోర్ సెట్స్ లో ఉంటే ఆరోజు ఎన్ని సీన్స్ చేసినా అలిసిపోను.  సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తీ ఒక్కరికీ ధ‌న్య‌వాదాల‌న్నారు.
ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు మాట్లాడుతూ….ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి, సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.
రాహుల్ ర‌వీంద్ర‌న్ హీరోగా, ప‌వ‌ని గంగి రెడ్డి హీరోయిన్లుగా ప‌నిచేస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, స‌త్య ప్ర‌కాష్, ర‌వి వ‌ర్మ‌, ప్ర‌మోదిని.. త‌దిత‌రులు న‌టిస్తున్నారు.
మేనేజ‌ర్ః జె వి డి ప్ర‌సాద్,,కో ప్రొడ్యూస‌ర్ – శ్రీనివాస్ మోతుకూరి,,క‌థ – బి.బి కిర‌ణ్ (బి. భాను కిర‌ణ్)
ఎడిట‌ర్ – ఉద్ద‌వ్ ఎస్ బి, సినిమాటోగ్ర‌ఫీ – పి.బాలరెడ్డి, సంగీతం- న‌రేష్ కుమార‌న్
బ్యాన‌ర్ – ఎమ్ స్వేర్, నిర్మాత – మోహ‌న్, క‌థ‌, క‌థ‌నం – రామ్ అబ్బ‌రాజు