ప్రేమలో నేను ఐదుసార్లు ఓడిపోయాను !

“ప్రేమలో నేను ఐదుసార్లు ఓడిపోయాను. అలా ఓడిన ప్రతిసారీ గదిలో కూర్చుని ఏడ్చేదాన్ని. మగవారిలో మంచివాళ్లు ఎక్కువే, కొందరు చెడ్డవాళ్లు ఉన్నారు”… అని అంటోంది నటి రాయ్‌లక్ష్మీ. సంచలనాలకు కేంద్రబిందువుగా ముద్రపడిన ఈ బహుభాషా నటి తరచూ ఏదో ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం పుట్టిస్తూనే ఉంటుంది. కొన్నేళ్ల కిందట ‘టీమిండియా క్రికెటర్ ధోనితో డేటింగ్‌’ అంటూ రాయ్‌లక్ష్మీ గురించి హాట్‌ హాట్‌ ప్రచారం జరిగింది. తాజాగా హిందీ చిత్రం ‘జూలీ-2’ చిత్ర ట్రైలర్‌లో తన అందాలతో మరోసారి వార్తల్లో నానుతోంది. ఇటీవల ఆమె మరిన్ని విషయాలపై చర్చించారు. ‘జూలీ-2 చిత్రంలో నేను గ్లామరస్‌గా నటించాననే ప్రచారం జరుగుతోంది. చిత్ర ట్రైలర్‌ను చూసిన వారు అలా అనుకోవడంలో తప్పులేదు. అయితే చిత్రం పూర్తిగా చూసిన వారు నా పాత్రను చూసి ‘అయ్యో పాపం’ అనుకుంటారు. అందులో నాన్న చనిపోతారు. అమ్మ రెండో పెళ్లి చేసుకుంటుంది. అమ్మ రెండో భర్త నన్ను బయటకి వెళ్లి సంపాదించుకురా అని తరిమేస్తాడు.అలా ఎంతో కష్టపడి పోరాడి నటిగా నిలదొక్కుకుంటున్న యువతి పాత్ర నాది.

 

సినీరంగంలో ఇటీవల అత్యాచారాల గురించి చాలా మంది హీరోయిన్లు బహిరంగంగా వెల్లడిస్తున్నారని… అయితే తనకలాంటి అనుభవం ఎదురు కాలేదు. తనను దర్శకుడు ఆర్‌వీ ఉదయకుమార్‌ ‘కర్క కచడర’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం చేశారని, ఆ తరువాత అవకాశాలు లేక నాలుగేళ్లు పోరాడాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు సెక్స్‌ సంబంధాల గురించి నర్మగర్భంగా అర్ధమైంది. అనుసరించి పోవాలని కొందరు చెప్పారు. అలా చేస్తే నేనిప్పుడు సూపర్‌ హీరోయిన్‌ అయ్యేదాన్ని. అప్పట్లో నాకు తమిళ భాషలో ఒక్క పదం కూడా తెలిసేది కాదు. కొందరు నాపై దుష్ప్రచారం చేసేవారు. ఇక ప్రేమలో నేను ఐదుసార్లు ఓడిపోయాను. అలా ఓడిన ప్రతిసారీ గదిలో కూర్చుని ఏడ్చేదాన్ని. మగవారిలో మంచివాళ్లు ఎక్కువే, కొందరు చెడ్డవాళ్లు ఉన్నారు. నటుడు ఆర్య నాకు చాలా కాలంగా మంచి స్నేహితుడు మాత్రమే. నాకు రాజకీయాలు తెలియనందున రాజకీయ రంగంలోకి వచ్చే ఆలోచనే లేదని’ తన మనసులో మాటను రాయ్‌లక్ష్మీ స్పష్టం చేసింది.