దాని వల్ల చాలా అవకాశాలు వదులుకున్నా!

తెలుగులో మెగాస‍్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమాతో ‘రత్తాలు రత్తాలు..’  అంటూ తెలుగు ప్రేక్షకులను తన అందాలతో రాయ్‌లక్ష్మీ కవ్వించింది. ప్రస్తుతం ఈ భామ ఇటీవల ఎక్కడా కనిపించడం లేదని ఆలోచిస్తుండగానే …. ఓ బాలీవుడ్‌​ మూవీ ఛాన్స్‌ వల్ల మంచి అవకాశం కోల్పోయానని చెప్పింది రాయ్‌లక్ష్మీ.   ‘ఇటీవల మలయాళంలో సూపర్‌స్టార్‌ మమ్ముట్టితో రొమాన్స్‌ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నా. అందుకు కారణం బరువు పెరగడమే. నేను హిందీలో ‘జూలీ -2’ చిత్రంలో నటిస్తున్నాను. బాలీవుడ్‌లో చిత్రం చేయాలన్న ఆశతోనే మమ్ముట్టి చిత్రాన్ని అంగీకరించలేదు.

‘జూలీ-2’లో నాది కీలకపాత్ర. అందుకోసం ఏడాదిన్నరపాటు శ్రమించాను. ఈ పాత్ర కోసం దాదాపు 11 కిలోల బరువు తగ్గా, ఆపై 7 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. అలా బరువు పెరగడం, తగ్గడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులకు గురయ్యా. షూటింగ్‌ కూడా అందుకే ఆలస్యమైంది. అయితే నా ఫ్యామిలీ సహకారంతో ఆ బాధ నుంచి తేలిగ్గానే బయట పడ్డాను. దీంతో చాలా అవకాశాలు వదులుకున్నాను. స్టార్ హీరో మమ్ముట్టీకి జంటగా నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోయింది. అందుకు కారణం నేను బరువు పెరగడమే. ఇకపై వైవిధ్యభరిత పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని’  పేర్కొంది. జూలీ-2 మూవీ అక్టోబర్లో విడుదల కానుంది.