నూతన గాయనీ గాయకులకు అవకాశం కల్పించే ‘పాటల పల్లకి’

శ్రీ ప్రహర్ష దేవి బ్యానర్లో రూపొందుతున్న ‘పాటల పల్లకి’. కార్యక్రమం ద్వారా  నూతన గాయనీ గాయకులకు అవకాశం కల్పించి ఉజ్వల భవిష్యత్తును  అందించాలనే ఆకాంక్షతో ‘మొగుడ్స్ పెళ్ళాంస్’ ఫేమ్స సంగీత దర్శకుడు రాజ కిరణ్ నిర్వహిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి దర్శకుడుగా ఎస్. కేశవ్, నిర్మాతగా కె. చిన్న మల్లయ్య, సహా నిర్మాత గా నంది కంటిబాబు రాజు వ్యవహరిస్తున్నారు. ఈ  పాటల పల్లకి ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో సాంగ్ ను  బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్లో అత్యుత్తమ సినీ గీత రచయితల సమక్షంలో విడుదల ,చేశారు.
ఈ సందర్భంగా నటుడు మరియు సింగర్  కమల్ మాట్లాడుతూ.. ఎవరికి వాళ్లే తోపు అనుకుంటేనే.. ఇండస్ట్రీలో  రాణించగలరు.. కనుక ఇక్కడున్న కొత్త సింగర్స్ ఎవరికి వారే తోపు అనుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నా.. అలానే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్ కిరణ్, బాబు రాజు, చిన్న మల్లయ్య లను అభినందిస్తున్నా అన్నారు.
నిర్మాత చిన్న మల్లయ్య మాట్లాడుతూ.. 4 ఏళ్ల కిందట మా అమ్మాయి  శ్రీ ప్రహర్ష పేరున బ్యానర్ ను స్టార్ట్ చేసాము. నాలుగు సినిమాలు చేసాము మొదటిది ‘నా ఊహల్లో’ 2 నెలల్లో విడుదల కానుంది.. మనసున్నోడు, రాజఖడ్గం సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం రాజ్ కిరణ్ సంగీత సారధ్యంలో ‘పాటల పల్లకి’ అనే ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది న్యూ సింగర్స్ ను పరిచయం చేయనున్నాము.. కొత్త టాలెంట్ ను వెలికితీసే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్ధ్యంతోనే ముందుకు రావడం జరిగింది అని అన్నారు. రాజ కిరణ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.. అందుకే ఆయన సంగీతం సారధ్యంలో వస్తున్న ఈ పాటల పల్లకి ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నాము.. విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నా అన్నారు సహ నిర్మాత బాబు రాజా.
సంగీత  దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. అలనాడు  మహా సంగీత దర్శకులు సమకూర్చిన అద్భుతమైన బాణీలను చిరస్థాయిగా బావి తరాల వారికి కూడా నిలిచి ఉండాలనే ఆశతో అలనాటి పాటలను మరల సమకూర్చి మా ‘పాటల పల్లకి’ ద్వారా పాడాలని ఆశక్తి కలిగి, పాడగల ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించి తద్వారా ఎంతో మందికి ఆర్థికంగా కొంచెం సహాయ పడాలనే ఉద్దేశం తోనే ఈ’పాటల పల్లకి’ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి దర్శకత్వం వహిస్తున్న  ఎస్ కేశవ నా మిత్రుడు.. తానో ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.. అలానే ఇంత మంచి కారక్రమానికి నిర్మాతలుగా సహకరించిన బాబు రాజు, చిన్న మల్లయ్యలకు నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు.
ఈ పాటల పల్లకి ప్రోగ్రామ్ కు హీరో సునీల్ వీడియో ద్వారా అభినందనలు మరియు బెస్ట్ విషెస్ ను అందచేయడం విశేషం. ఇంకా ఈ కార్యక్రమంలో నూతన గాయని గాయకులతో పాటు  వేణు, కిరణ్, జై శ్రీనివాస్, పి. వెంకటేష్, రాంకీ, గురుచరణ్ తదితరులు పాల్గొని పాటల పల్లకి టీమ్ కు అభినందనలు తెలియచేసారు..
పాటల పల్లకి ప్రోగ్రామ్ కు నిర్మాత:  కె. చిన్న మల్లయ్య, సహ నిర్మాత: నందికంటి బాబు రాజు, దర్శకత్వం: ఎస్. కేశవ్, సంగీతం: ఎస్. రాజ్ కిరణ్, రచన: రామారావు మాతుమూరు, మేనేజ‌ర్ : వి ఎస్. చారి.