రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ ఏప్రిల్ 3న విడుదల

‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం ఏప్రిల్ 3 న విడుదల చేయనున్నారు. రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న విడుదల చేయనున్నారు.
 
నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. ”మా ‘ఒరేయ్ బుజ్జిగా’ షూటింగ్ పూర్తయింది. రాజ్‌ తరుణ్‌ యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దర్శకులు కొండా విజయ్‌కుమార్‌గారు డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా మా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ” అన్నారు.
రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి ముఖ్యపాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌