రాజ్‌తరుణ్‌ హీరోగా సంజనా రెడ్డి ‘రాజుగాడు’

యువకథానాయకుడు రాజ్‌తరుణ్‌ ఇప్పుడు వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన ‘ఈడోరకం-ఆడోరకం’, ‘కిట్టుఉన్నాడుజాగ్రత్త’, ‘అంధగాడు’ సినిమాతో హ్యాట్రిక్‌ హీరోగా నిలిచారు. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌త‌రుణ్ చేస్తోన్న చిత్రం ‘రాజుగాడు’. సంజనా రెడ్డి దర్శకురాలు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అమైరా ద‌స్తుర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా…

నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ – ”యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌తో మా బేనర్‌లో హాట్రిక్‌ హిట్స్‌ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనతో ‘రాజుగాడు’ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. లేడీ డైరెక్టర్‌ సంజనారెడ్డి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీ, లవ్‌, యాక్షన్‌ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న ఎంటర్‌టైనర్‌ ఇది. రాజ్‌తరుణ్‌ను సరికొత్త పాత్రలో చూస్తారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, రావు ర‌మేష్‌గారు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. రెండు పాటలు మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా గత చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన విధంగానే ఈ సినిమా కూడా అలరిస్తుంది” అన్నారు. 

రాజ్‌త‌రుణ్‌, అమైరా ద‌స్తుర్‌, పూజిత‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రావు రమేష్‌, నాగినీడు, పృథ్వీ, రాజా ర‌వీంద్ర‌, కృష్ణ‌భ‌గ‌వాన్‌, సిజ్జు, సుబ్బ‌రాజు, ప్ర‌వీణ్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్‌: కృష్ణ మాయ, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్‌, సంగీతం: గోపీ సుందర్‌, చీఫ్ కో డైరెక్ట‌ర్ః దాసం సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గరికిపాటి, సహ నిర్మాతలు: అజయ్‌ సుంకర, డా.డి.ల‌క్ష్మ‌ణ‌రెడ్డి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: సంజనారెడ్డి.
Raj Tarun’s ‘Raju Gadu’ for Sankranthi

After hat-trick hits like ‘Eedo Rakam Aado Rakam’, ‘Kittu Unnadu Jagratha’ and ‘Andhhagadu’, Raj Tarun and producer Anil Sunkara are getting ready to entertain the audience once again with another complete entertainer. ‘Raju Gadu’, directed by debutante Sanjana Reddy, is gearing up for a release for Sankranthi, 2018.
This movie, produced by Ramabrahmam Sunkara under AK Entertainments banner, is going to be a complete entertainer with all the elements like love, comedy and action. Raj Tarun will be seen in a very fresh role in this movie. He romances Amyra Dastur in this movie. The shooting of the film has been completed except for two songs.
Ramabrahma Sunkara, the producer, says, “After hat-trick hits, we are very happy to have been associated with Raj Tarun once again for ‘Raju Gadu’. It’s a complete entertainer and Sanjana Reddy has done a fabulous job. Raj Tarun will surprise the audience in a new role. Rajendra Prasad and Rao Ramesh are playing important roles in this movie. The shoot has been completed except for two songs. We are planning to release the film for Sankranthi next year and we are sure the film will be another hit from our banner”.
Raj Tarun, Amyra Dastur, Poojitha, Rajendra Prasad, Rao Ramesh, Nagineedu, Prudhvi, Raja Ravindra, Krishna Bhagavan, Sijju, Subbaraju, Praveen are part of cast. Art: Krishna Maya, Editing:M.R.Varma, Cinematography: B.Rajasekhar, Music: Gopi Sundar, Chief Co-director: Dasam Sai, Executive Producer: Kishore Garikipati, Co-Producers: Ajay Sunkara, Dr.D.Lakshmana Reddy, Producer: Ramabrahmam Sunkara, Director: Sanjana Reddy.