సిద్ శ్రీ‌రామ్ పాటలతో రాజ్‌తరుణ్ ‘ఒరేయ్‌ బుజ్జిగా’

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచ‌నాల‌ను పెంచింది.యూత్‌ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలోని పాట‌లు ఈ మూవీకి మ‌రింత క్రేజ్‌ను తెచ్చాయి.. అనూప్ రూబెన్స్ స్వ‌ర ప‌రిచిన అన్ని పాట‌లు సంగీతాభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా..
“ఈ మాయ పేరేమిటో.. ఏమిటో..” అంటూ హుషారుగా సాగే పాట‌ని లేటెస్ట్ సింగింగ్ సెన్సేష‌న్ సిద్ శ్రీ‌రామ్ పాడారు. ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ పాటకు కిట్టు విస్సా ప్ర‌గడ సాహిత్యం అందించారు.
ఈ సినిమాలోని పాట‌లు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల‌య్యాయి.
రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా ..కీలక పాత్రలో హెబా పటేల్‌తో పాటు.. వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు చేసారు.మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌.