‘ఆర్‌ఆర్‌ఆర్’ నుండి‌ ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్‌

‘ఆర్‌ఆర్‌ఆర్’‌(రౌద్రం రణం రుధిరం)… చిత్రం నుండి తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ 119వ జయంతి అక్టోబర్‌ 22 సందర్భంగా ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్‌ను ‌రామ్‌చరణ్‌ విడుదల చేశారు.
కొమురం భీమ్‌ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్‌లో సాగుతున్న ఈ టీజర్‌లో….
వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ” అంటూ రామ్‌చరణ్‌ చెబుతున్న డైలాగ్స్‌, ఎన్టీర్‌ నటనకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది.
https://www.youtube.com/watch?reload=9&v=Chkbd4iZqKA
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌, హైటెక్నికల్ వేల్యూ‌తో రూపొందుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)’ను  డిి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌  బ్యానర్‌పై  డి.వి.వి.దానయ్య  నిర్మిస్తున్నారు. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్‌ చూస్తుంటే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ ఎన్నో వైరటీ పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు ఆ పాత్రలను మించేలా డిఫరెంట్‌ లుక్‌తో ఇందులో కనపడుతున్నారు. నేలతల్లిని నమ్ముకున్న ఓ అడవిపుత్రుడు ఎలా ఉంటాడో అలా కనపడుతున్నారు ఎన్టీఆర్‌. రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు.
కోవిడ్‌ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా రీసెంట్‌గా రీస్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా మేజర్‌ పార్ట్‌ చిత్రీకరణను పూరిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ నవంబర్‌ నుండి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. అలాగే సినిమాలో ఇతర కీలకపాత్రలో నటిస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, హాలీవుడ్‌ స్టార్‌ ఓలివియా మోరిస్‌ ఇతర తారలు తదుపరి షెడ్యూల్ లో జాయిన్‌ అవుతున్నారు.