దుబాయి లో భారీ స్థాయిలో రజనీ ‘2.ఓ’ పాటల విడుదల !

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘2.ఓ’. అమీజాక్సన్‌ కథానాయిక. శంకర్‌ దర్శకత్వం వహించారు. లైకాప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరకర్త. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో పాటల విడుదల వేడుక అట్టహాసంగా జరిగింది. భారీ హంగుల మధ్య జరిగిన ఈ వేడుకకి ఎ.ఆర్‌.రెహమాన్‌ సింఫనీ ఆర్కెస్ట్రా సంగీత ప్రదర్శనతో పాటు, బాస్కో బృందం నృత్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘2.ఓ’ పాటల విడుదల సందర్భంగా దుబాయ్‌ నగరంలో ఎక్కడ చూసినా ఆ సినిమా పోస్టర్లే దర్శనమిచ్చాయి. స్కై డైవ్‌ చేస్తూ పోస్టర్‌ని ప్రదర్శించడం ఆకట్టుకుంది. యువ కథానాయకుడు రానా, బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌జోహార్‌, తమిళ నటుడు ఆర్‌.జె.బాలాజీ వేడుకని హోస్ట్‌ చేశారు. రజనీకాంత్‌ కుటుంబసభ్యులతో పాటు సూర్య, జ్యోతిక, కార్తి తదితరులు పాల్గొన్నారు.