‘కాలా’ సినిమాలో ర‌జినీకాంత్ సెకండ్‌ లుక్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలా’. పా రంజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు తలైవా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ‘కాలా’ చిత్రంలోని సెకండ్‌ లుక్‌ను విడుదల చేసింది.కొన్ని నెలల క్రితం ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అందులో రజనీ  జీపుపై స్టైల్‌గా కూర్చున్నారు. సెకండ్‌ లుక్‌లో ఒంటినిండా మసితో కళ్లద్దాలు పెట్టుకుని కోపంగా చూస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై రజనీ అల్లుడు ధనుష్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రజనీకి జోడీగా బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ నటిస్తోంది.ముంబై లో తొలి భాగం చిత్రీకరణ పూర్తైంది. మిగతా షెడ్యూల్‌ను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క రజనీ నటించిన ‘2.0’చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల దుబాయ్‌లో సినిమా ఆడియో లాంచ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్‌ నటించింది. 2018 ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.