ర‌జ‌నీ, శంకర్ ల ‘2.0’ నవంబర్‌ 29న

శంకర్ దర్శకత్వం లో ‘సూప‌ర్ స్టార్’ ర‌జ‌నీకాంత్‌ తో తెర‌కెక్కిన అత్యంత ప్ర‌తిష్టాత్మక చిత్రం ‘2.0‘. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ప‌లు కార‌ణాల వ‌ల‌న విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.ఈ ఏడాది నవంబర్‌ 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఇప్ప‌టికే అనేక రిలీజ్ డేట్స్ ప్ర‌క‌టించారు చిత్ర బృందం. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్ర‌కటించింది చిత్ర నిర్మాణ సంస్థ‌. ఈ ఏడాది నవంబర్‌ 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రోడక‌్షన్స్‌, చిత్ర దర్శకుడు శంకర్‌ ఈ మేరకు ట్విటర్‌లో తెలిపారు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్, అమీజాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

ఈ చిత్రం గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లోనే విడుద‌ల కావ‌ల‌సి ఉంది. కాని దీపావ‌ళికి రిలీజ్ అన్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ వాయిదా వేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 25న 2.ఓ విడుద‌ల అవుతుందని అనుకున్నప్ప‌టికి అదీ జ‌ర‌గ‌లేదు. ఈ దీపావ‌ళికి చిత్రం ప‌క్కా విడుద‌ల అవుతుంద‌ని అంద‌రు భావిస్తుండ‌గా, కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అభిమానుల ఆనందాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లారు. దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్‌తో రోబో 2 చిత్రాన్ని తెర‌కెక్కించిన శంక‌ర్ రెండేళ్ల క్రిత‌మే షూటింగ్ పూర్తి చేశాడు. కాని గ్రాఫిక్స్ ప‌నుల విష‌యంలో చాలా స‌మ‌యం ప‌డుతోంది. ‘2.ఓ’ గ్రాఫిక్‌ పనులు చూస్తున్న లండన్‌ సంస్థ సమస్యలో చిక్కుకుందని, అందువల్ల మరింత ఆలస్యమవుతుందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ‘బాహుబ‌లి’ సినిమా క‌లెక్ష‌న్స్‌ని త‌ల‌ద‌న్నేలా ‘రోబో 2’ చిత్రం ఉంటుంద‌ని, ఈ సినిమా హాలీవుడ్ త‌ర‌హాలో ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగింది.