ట్రిబ్యున‌ల్ కు రాజేష్ ట‌చ్ రివ‌ర్‌ ‘ర‌క్తం’

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డు గ్ర‌హీత రాజేష్ ట‌చ్రివ‌ర్ త‌ను రూపొందించిన ‘ర‌క్తం’ చిత్రానికి సెన్సార్ స‌భ్యులు తెలిపిన అభ్యంత‌రాల‌పై తీవ్ర అసంత్రుప్తి వ్య‌క్తం చేశారు. ఐదు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు, ఐదు నామినేష్ల‌కు ఎంపికైన ఈ చిత్రంపై సెన్సార్ స‌భ్యులు తెలిపిన అభ్యంత‌రాలు సంత్రుప్తిక‌రంగా లేవ‌ని ఆయ‌న అన్నారు. ఎలాంటి అస‌భ్య‌త లేకుండా, మాన‌వీయ కోణంలో చిత్రీరించిన ఈచిత్రానికి సెన్సార్ స‌భ్యులు చెప్పిన అభ్యంత‌రాలు స‌రైన‌వి కావు. 2(12) గైడ్ లైన్స్ ప్ర‌కారం క‌ట్ ఇచ్చామ‌ని రిపోర్ట్ పంపించారు. వాళ్లు సూచించిన గైడ్ లైన్స్ చ‌ద‌వ‌గానే నాకు చాలా ఆశ్చ‌ర్య‌మైంది. ఇద్ద‌రు విప్ల‌వ‌కారుల మ‌ధ్య జ‌రిగే సీరియ‌స్ సంభాష‌ణ అది. వాళ్లు ఇచ్చిన గైడ్ లైన్స్ సెక్స్‌వ‌ల్ గా త‌ప్పుదారి ప‌ట్టించేదేంటో నాకు అర్థం కాలేదు. సామాజిక ప‌రివ‌ర్త‌న కోసం ర‌క్తం చిందించ‌డం అవ‌స‌ర‌మా? అనే సెన్సిబుల్‌ క‌థంశంతో సాగే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యలు చెప్పిన అభ్యంత‌రాలు చిత్ర క‌థ‌ను చిన్నాభిన్నం చేసేలా వున్నాయి. అందుకే నేను ట్రిబ్యున‌ల్ కు వెళుతున్నాను అన్నారు.
 
ఈ చిత్రంలో బెన‌ర్జీ, సంజు శివ‌రామ్‌,, , మ‌ధుశాలినీ, స‌న‌, జాన్ కోటోలీ త‌దిత‌రులు న‌టించిన
ఈ చిత్రానికి మాట‌లుః న‌ర‌సింహ కుమార్‌, పాట‌లుః శివ‌సాగ‌ర్‌, ర‌వి కే.పున్నం, న‌ర‌సింహా కుమార్‌, ఎడిటింగ్ః శ‌శి కుమార్‌, సంగీతంః వివేక్ మ‌హాదేవ్‌, కెమెరాః జే.డి.రామ తుల‌సి, స‌హ నిర్మాతః మున్షీ రియాజ్ అహ‌మ్మ‌ద్‌, నిర్మాతః డా.. సునీతాక్రుష్ణ‌న్‌, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః రాజేష్ టచ్ రివ‌ర్‌