మహేష్ విడుద‌ల చేసిన `దర్బార్` మోషన్ పోస్టర్

రజినీకాంత్- ఏఆర్‌మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం`దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రజిని పోస్టర్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

‘దర్బార్’ మూవి తెలుగు మోషన్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ విడుద‌ల చేశారు. ఆదిత్య అరుణాచలం గా సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఈ మోషన్ పోస్టర్.. అనిరుధ్ పవర్ మ్యూజిక్ తో సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. దర్బార్ మోషన్ పోస్టర్ ని తమిళ్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, హిందీ లో సల్మాన్ ఖాన్, మలయాళం లో మోహన్ లాల్ విడుదల చేశారు.

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.
Rajinikanth ‘Darbar’ Telugu Motion Poster Launched by Mahesh Babu 
Rajinikanth’s latest film ‘Darbar’ ..Directed by AR Murugadoss is gearing up to release for Sankranthi. Passionate Producer A Subhaskaran is producing this big budgeted film with high technical values under Lyca Productions. Rajini will be seen in the role of a Powerful Police Officer. Murugadoss is making this film in a prestigious manner. Music Sensation Anirudh Ravichander is composing the music. The posters and stills of Rajinikanth released so far has created tremendous response on the film. Telugu Motion Poster of ‘Darbar’ is unveiled by Superstar Mahesh. The motion poster featuring Superstar Rajinikanth with his swag as Aaditya Arunasalam in the role of a fiery cop has raised the buzz on the film further more. Anirudh’s power packed music has taken the motion poster video to next level.
Nayanthara will be seen as female lead in the film while Nivetha Thomas is doing a crucial role. Suniel Shetty, Thambi Ramayya, Yogi Babu, Prateik Babbar, Nawab Sha is other cast.Cinematography: Santosh Sivan, Music: Anirudh Ravichander, Editor:Sreekar Prasad, Produced by A Subaskaran, Directed by AR Murugadoss

Darbar Motion Poster Link :https://youtu.be/P23GUrJQ1H4