విడాకుల కోసం రజినీ కుమార్తె కోర్టు కు

రజినీకాంత్ కుమార్తె సౌందర్య భర్త అశ్విన్‌తో విభేదాల కారణంగా విడిపోవడానికి  సిద్ధమైంది. విడాకుల కోసం శుక్రవారం నగరంలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు.  అశ్విన్, సౌందర్య  2010లో వివాహమైంది. వీరికి వేద్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సౌందర్య గతంలో రజని తో ‘కొచ్చడియన్’ చిత్రాన్ని గ్రాఫిక్స్ ప్రధానం గా రూపొందించింది . ప్రస్తుతం ధనుష్, కాజోల్ తో ‘వేలయిల్ల పట్టదారి 2’ చిత్రానికి దర్శకత్వం చేస్తోంది

శుక్రవారం ఫ్యామిలీ కోర్టులో  వీరి విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణ సజావుగానే జరిగిందని, వచ్చే విచారణలోపు దంపతులిద్దరూ విడిపోవడానికి గల కారణాలు సవివరంగా తెలపాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అలాగే వారిద్దరి  అంగీ కారంతో   మెమో దాఖలు చేయాలని కూడా సూచించింది. అనంతరం వారి మెమోతో కోర్టు సంతృప్తి చెందితే చట్టబద్ధంగా విడిపోయేందుకు కోర్టు విడాకులు మంజూరు చేయనుంది.