కొత్త చిత్రం కోసం ‌కలం పట్టబోతున్నారు !

రజినీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం ‌కలం పట్ట బోతున్నారని తెలిసింది.సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా అంటే తనదైన శైలి మేనరిజమ్స్‌తో ఆయన పలికించే సంభాషణలు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటాయి. పంచ్‌డైలాగ్‌లకు కొదువుండదు. అందుకే రజనీకాంత్‌ సినిమా డైలాగ్స్‌ విషయంలో దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.  రజనీకాంత్‌ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ‘అన్నాత్తె’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. నయనతార, కీర్తిసురేష్‌ కథానాయికలు. మీనా, ప్రకాష్‌రాజ్‌  కీలక పాత్రల్లో నటించబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రజనీకాంత్‌ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారట. పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగ్స్‌తో పాటు భావోద్వేగ ప్రధానంగా సంభాషణలు సాగుతాయని తెలిసింది. ఈ  సినిమాలో తన పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగా నచ్చడంతో సంభాషణల్ని తానే స్వయంగా రాస్తానని రజనీ చిత్ర బృందానికి చెప్పాడట. ఇందుకు దర్శకుడు కూడా ఓకే  చెప్పడంతో రజనీకాంత్‌ ఇప్పటికే ఒక డైలాగ్‌ వెర్షన్‌ పూర్తి చేశారని తెలిసింది. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్… రజనీకాంత్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారనే విషయం ఇప్పటివరకూ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ నటిస్తారని తెలిసింది. ఈ ఫ్యామిలీ డ్రామాలో జాకీతో తలపడనున్నారట రజనీకాంత్‌. ఈ ఏడాది చివర్లో చెన్నైలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.

Balus last song in Rajinikanth’s ‘Annatthe’… Balu sang many of the ‘Superstar’s introduction songs. SPB is no more, but his voice will still be part of the much anticipated ‘Rajinikanth’s intro number’ in the actor’s upcoming Annaatthe. Music composer D Imman said.. “I feel so blessed to think that his last song was for Rajinikanth and under my music direction.

Rajinikanth’s Annaatthe sees the actor teaming up for the first time with director Siva.. who is known for helming Ajith-starrers Viswasam and Veeram. Produced by Sun Pictures