రెండున్నర గంటలు నవ్వించే ‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఉగాదికి

‘ఒరేయ్‌ బుజ్జిగా…` ఉగాది కానుకగా మార్చి 25న విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ .
 
కె.కె. రాధా మోహన్ మాట్లాడుతూ..”ఒరేయ్ బుజ్జిగా` సినిమా ఈ ఉగాదికి పచ్చడిలా వస్తుంది. ఇప్పటికే విడుదలైన `కురిసెన, కురిసెన` పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కి, ఫ్యామిలీస్ కి నచ్చే అన్ని రకాల కమ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. విజయ్ కుమార్ గారు పక్కగా ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల సినిమాకి అవసరమైన సన్నివేశాలే తీశారు. దాని వల్ల వర్కింగ్ డేస్ తగ్గి నిర్మాతలకి మంచి జరుగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. వాణి విశ్వనాధ్ గారు హీరోయిన్ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్ర చేశారు.మేము మొదలు పెట్టిన మొబైల్ పబ్లిసిటీ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాకి మార్చి 14న కరీంనగర్ లో, 19న తిరుపతిలో, 21 హైదరాబాద్ లో మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాం’ అన్నారు.
 
“మా నిర్మాత రాధా మోహన్ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. చాలా మంచి నిర్మాత. కథకు ఏమి కావాలో అన్ని ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో హ్యుజ్ ప్యాడింగ్‌ ఉంది. అందరు చక్కగా నటించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. మాళవిక నాయర్ న్యాచురల్ ఆర్టిస్ట్. అలాగే ఆండ్రూగారు, అనూప్ ఇలా అందరు మంచి మంచి టెక్నీషియ‌న్స్‌ కుదిరారు. ఆడియన్స్ అందరూ పడి పడి నవ్వుకునే సినిమా చేయాలని ఒరేయ్ బుజ్జిగా చేయడం జరిగింది’ అన్నారు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.
“ఒరేయ్ బుజ్జిగా` ఒక కంప్లీట్ ఎంటర్ టైనర్. టీమ్ అందరూ ఎంతో ఫ్యాషన్ తో సినిమాని ముందుకు తీసుకెళ్లారు. థియేటర్ లో సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్ గారికి, దర్శకుడు విజయ్ కుమార్ గారికి ధ‌న్యవాదాలు” అన్నారు రాజ్ తరుణ్ మాట్లాడుతూ.
మాళవిక నాయర్ మాట్లాడుతూ..“సినిమా ఒక టీమ్ క్రాఫ్ట్ అని అంటారు. నాకు తెలుగు రాకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సినిమా ఇంకా బాగా రావడానికి హెల్ప్ చేశారు. విజయ్ కుమార్ గారు సినిమా బిగినింగ్ నుండి నాకు గైడింగ్ స్పిరిట్ గా ఉన్నారు. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంద‌రికీ ఒక హ్యుజ్ ఇన్‌స్పిరేషన్. ఆయన వల్లే టీమ్ అందరం ఇంత బాగా పెర్ఫామ్ చేయగలిగాం. మా నిర్మాత రాధామోహన్ గారు మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు ‘ అన్నారు.
 
హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి,మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌,కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి